RRR నుంచి బిగ్ సర్‌ప్రైజ్: కొత్త పోస్టర్‌తో గుడ్ న్యూస్ చెప్పిన యూనిట్.. ఎన్టీఆర్, చరణ్ పని ఖతం

తెలుగు సినీ ప్రియులే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). 'బాహుబలి'తో టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో పాటు ఓ గుడ్ న్యూస్‌ను కూడా చెప్పింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

రియల్ హీరోల కథతో టాలీవుడ్ హీరోలు

రియల్ హీరోల కథతో టాలీవుడ్ హీరోలు

ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ నటిస్తున్నారు.

మూడేళ్లు పూర్తైంది... ఎన్నో ఆటంకాలు

మూడేళ్లు పూర్తైంది... ఎన్నో ఆటంకాలు

RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తైంది. కానీ చిత్రీకరణ మాత్రం ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. దీనికి కారణం ఈ సినిమాకు పలుమార్లు ఆటంకాలు ఎదురు కావడమే. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా ఇది రెండు సార్లు ఆపేయాల్సి వచ్చింది. ఫలితంగా చిత్రీకరణ అంతకంతకూ ఆలస్యం అవుతూనే వచ్చింది. దీనిపై సినీ ప్రియులంతా నిరాశగా ఉన్నారు.

రిలీజ్ డేట్ మారుతుందని.. మళ్లీ అదేనా

రిలీజ్ డేట్ మారుతుందని.. మళ్లీ అదేనా

RRR సినిమా 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అయితే, ఇది వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఇదే కన్ఫార్మ్ అని తెలుస్తోంది.

షూటింగ్ షురూ.. జెట్ స్పీడుతో పనులు

షూటింగ్ షురూ.. జెట్ స్పీడుతో పనులు

కరోనా సెకెండ్ వేవ్ తర్వాత RRR మూవీ షూటింగ్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఈ సారి ఇది జెట్ స్పీడుతో జరుగుతోంది. ఏమాత్రం బ్రేక్ లేకుండా చిత్రీకరణను జరుపుతున్నారు. దీనికి చిత్ర హీరోలు ఇద్దరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం బయటకు వదిలారు. దీంతో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తారన్న నమ్మకం అందరిలోనూ కలుగుతోంది.

కొత్త పోస్టర్‌తో గుడ్ న్యూస్ చెప్పిన టీమ్

కొత్త పోస్టర్‌తో గుడ్ న్యూస్ చెప్పిన టీమ్

చిత్రీకరణ వేగంగానే జరుగుతున్నా RRR మూవీ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. దీంతో ఈ సారైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా.. చరణ్ వెనుక కూర్చుని ఉన్నాడు. ఇది వైరల్ అవుతోంది.

షూటింగ్ గురించి ఊహించని ప్రకటనతో

షూటింగ్ గురించి ఊహించని ప్రకటనతో

పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు షూటింగ్‌కు సంబంధించిన వివరాలను సైతం వెల్లడించింది RRR యూనిట్. ఈ మేరకు ట్విట్టర్‌లో 'రాపిడ్ స్పీడుతో వెళ్తున్నాం.. రెండు పాటలు మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది' అని గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు, ఆ పోస్టర్‌లో విడుదల తేదీ అక్టోబర్ 13, 2021 అనే ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎన్టీఆర్.. చరణ్ పని ఖతమైందని పోస్టు

ఎన్టీఆర్.. చరణ్ పని ఖతమైందని పోస్టు

అదే ట్వీట్‌లో RRR యూనిట్ మరో అదిరిపోయే అప్‌డేట్ కూడా ఇచ్చింది. 'చిత్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ల వాళ్ల పాత్రలకు సంబంధించిన డబ్బింగ్‌ను ఇప్పటికే రెండు భాషల్లో పూర్తి చేసేశారు. మరికొన్ని భాషలకు త్వరలోనే డబ్బింగ్ చెప్పనున్నారు' అంటూ వెల్లడించింది. అంటే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X