twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rahul Sipligunj Arrest: రాహుల్ సిప్లీగంజ్ అరెస్ట్.. పోలీసుల అదుపులో మరికొందరు ప్రముఖులు!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు హైదరాబాదీ పోరడు రాహుల్ సిప్లీగంజ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో గొప్ప గొప్ప పాటలను ఆలపించిన అతడు.. స్టార్ సింగర్‌గా మారిపోయాడు. అదే సమయంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో విన్నర్‌గానూ నిలిచాడు.

    దీంతో రాహుల్ కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాహుల్ సిప్లీగంజ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. అతడితో పాటు పలువురు ప్రముఖులను సైతం అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

     నగరంలో డ్రగ్స్.. పోలీసుల స్పీడ్

    నగరంలో డ్రగ్స్.. పోలీసుల స్పీడ్

    కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వాడకం భారీగా పెరుగుతోన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవలే దీనికి బానిసైన ఓ వ్యక్తి ప్రాణాలను కూడా కోల్పోయాడు. దీంతో నగర పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే నియమ నిబంధనలు పాటించని పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నారు.

    Bigg Boss Non Stop: ఐదో వారం షాకింగ్ ఎలిమినేషన్.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్.. ఆమె మళ్లీ సేఫ్!Bigg Boss Non Stop: ఐదో వారం షాకింగ్ ఎలిమినేషన్.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్.. ఆమె మళ్లీ సేఫ్!

    పబ్‌పై దాడి చేసిన అధికారులు

    పబ్‌పై దాడి చేసిన అధికారులు

    నగరంలో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్‌ను తగ్గించే చర్యల్లో భాగంగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌పై గత రాత్రి దాడి చేసినట్లు తెలుస్తోంది. అందులో నిర్వహిస్తోన్న ఓ పబ్‌ను కూడా తనిఖీలు చేశారు. అప్పుడు దాన్ని నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే వాళ్లపై చర్యలు తీసుకున్నారు.

    150 మంది అరెస్ట్.. రాహుల్ కూడా

    150 మంది అరెస్ట్.. రాహుల్ కూడా

    సమయానికి మించి నడుపుతున్నారన్న కారణంతో సదరు పబ్‌ యజమానిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. అంతేకాదు, ఆ సమయంలో అందులో ఉన్న 150 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇక, అరెస్ట్ అయిన వాళ్లలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగుంజ్‌ కూడా ఉన్నాడట.

    Malaika Arora: రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!Malaika Arora: రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!

    పోలీసుల అదుపులో ప్రముఖులు

    పోలీసుల అదుపులో ప్రముఖులు

    శనివారం రాత్రి ప్రముఖ పబ్‌లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన 150 మందిలో సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌తో పాటు కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వాళ్లు ఎవరన్నది మాత్రం బయటకు రాలేదు. దీంతో సదరు ప్రముఖులు ఏ రంగానికి చెందిన వాళ్లు అన్న దానిపై మాత్రం క్లారిటీ రాకపోవడంతో ఈ హ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది.

    వాళ్లను విడిచిపెట్టిన పోలీసులు

    వాళ్లను విడిచిపెట్టిన పోలీసులు

    ప్రముఖ పబ్‌లో 150 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వాళ్లందరినీ బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారట. ఆ సమయంలో తమను ఎందుకు అరెస్ట్ చేశారంటూ చాలా మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మందిని విచారించి ఇంటికి పంపేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 38 మందిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.

    Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!

    రేవ్ పార్టీనా? డ్రగ్స్ వాడారా? అని

    రేవ్ పార్టీనా? డ్రగ్స్ వాడారా? అని

    తాజాగా జరిగిన వ్యవహారంలో రాహుల్ సిప్లీగంజ్ పేరు బయటకు రావడంతో ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో అసలు నిజంగానే నిబంధనలు పాటించడం లేదని పోలీసులు చర్యలు తీసుకున్నారా? అని అనుమానం కలుగుతోంది. ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడకం.. రేవ్ పార్టీ అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో ఇదంతా సస్పెన్స్‌గా మారింది.

    రాహుల్ గతంలోనూ చాలాసార్లు

    రాహుల్ గతంలోనూ చాలాసార్లు

    రాహుల్ సిప్లీగంజ్‌కు పోలీసుల అరెస్ట్ అనేది కొత్త విషయం కాదు. గతంలోనూ అతడు పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. అయితే, అవన్నీ చిన్న కేసులే కావడంతో బయట పడిపోయాడు. అయితే, ఇప్పుడు మాత్రం ఈ కేసుపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రాహుల్ కూడా పెద్ద కేసులో చిక్కుకుంటాడా అన్న సందేహాలు కూడా వస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    Bigg Boss Telugu Season 3 winner and Tollywood Singer Rahul Sipligunj Arrested by task force police in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X