Official: RRR కోసం తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి.. ఏ థియేటర్స్ లో అంటే?
తెలుగు సినీ లవర్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న RRR సినిమా మార్చి 25 వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షో లో బెనిఫిట్ షోలు ఫ్యాన్స్ లు ఏమైనా ఉంటాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. అయితే మార్చి 25వ తేదీన తెల్లవారుజామున స్పెషల్ షోలు ఉంటాయి అని ఆ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఇక ఏ థియేటర్స్ లో ఉంటాయి అనే వివరాల్లోకి వెళితే..

బిగ్ రిలీజ్..
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటించారు. మెగా నందమూరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై కేవలం వారి అభిమానులే కాకుండా మిగతా ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని చెప్పవచ్చు. మొదటి రోజే 100కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అత్యదిక థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ఏపీలో హ్యాపీ
ఇక ఈ సినిమాకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కొంత టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. మొదట 100 రూపాయల వరకు పెంచుకోవచ్చు అనే టాక్ వినిపించింది. ఇక ఆ తర్వాత 75 రూపాయల వరకు పెంచుకునే అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇది కొంత ఆనందించే విషయమే.

దిల్ రాజు ఆఫీస్ దగ్గర అభిమానులు
ఇక స్పెషల్ షోలు ఎక్కడ ఉంటాయి అనే ఇది ప్రస్తుతం అభిమానలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నైజాం హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ సొంతం చేసుకోగా ఆయన ఆఫీస్ దగ్గర చాలా మంది అభిమానులు ప్రత్యేకంగా స్పెషల్ షో లకు సంబంధించిన టికెట్ల కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

ఆ నిర్మాత చేతిలో స్పెషల్ షోలు
అయితే శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ప్రత్యేకమైన షో లకు సంబంధించిన హక్కులను ఇన్నామురి గోపీచంద్ అనే మరొక డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంతకుముందు వలిమై సినిమాను తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగుపెట్టిన గోపీచంద్ నైజాం కు సంబంధించిన స్పెషల్ షో హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.

స్పెషల్ షోలు ఎక్కడంటే?
ఇక శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ముందుగానే పోలీస్ ఉన్నతాధికారులకు ప్రత్యేకమైన షోలకు సంబంధించిన వివరాలను ఒక ప్రత్యేకమైన లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక ప్రీమియర్ షోలు కూకట్ పల్లి లోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్ థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. అలాగే మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ లో, బోరబండలోని విజేత థియేటర్ లో కూడా తెల్లవారుజామున ప్రత్యేకమైన షోలతో సందడి మొదలు కాబోతుంది.


Click it and Unblock the Notifications











