twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ప్లానింగ్ చూసి అంతా షాక్.... రూ. 600 కోట్లకు తగ్గకుండా!

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి 'బాహుబలి' సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు మన జక్కన్న. ఇండియాలోనూ హాలీవుడ్ స్థాయి భారీ ప్రాజెక్టులు సాధ్యమే అని నిరూపించిన దర్శక ధీరుడు.

    'బాహుబలి' తర్వాత రాజమౌళి చేపట్టిన మరో భారీ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మరో సంచలన క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

    రాజమౌళి పక్కా ప్లానింగ్

    రాజమౌళి పక్కా ప్లానింగ్

    రాజమౌళి ఏదైనా సినిమా ప్రాజెక్ట్ చేపట్టాడంటే ముందుగానే పక్కా ప్లానింగ్ ఉంటుంది. షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే బడ్జెట్, బిజినెస్ అవకాశాలు, స్టార్ కాస్ట్ లాంటి అంశాలపై తన టీమ్‌తో కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ‘బాహుబలి 2' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలోనూ ఇలాంటి కసరత్తే చేశారట.

    అలా ప్రాజెక్ట్ పట్టాలెక్కింది

    అలా ప్రాజెక్ట్ పట్టాలెక్కింది

    తన వద్ద ఉన్న కథకు రామ్ చరణ్, ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అని ఓ అంచనాకు వచ్చిన తర్వాత... వారి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. తనకు సన్నిహితుడైన డివివి దానయ్య బడ్జెట్ పెట్టేందుకు ముందుకు రావడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

    రూ. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్లానింగ్

    రూ. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్లానింగ్

    సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో రాజమౌళి అండ్ టీం స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తోంది. తాము పెడుతున్న రూ. 300 కోట్ల ఖర్చుకు..... రెట్టింపు అంటే రూ. 600 కోట్ల వచ్చేలా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్లాన్ చేశారట. ఈ మేరకు పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.

    రూ. 400 కోట్లు థియేటర్ బిజినెస్

    రూ. 400 కోట్లు థియేటర్ బిజినెస్

    ఒక్క థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ. 400 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేశారట. తెలుగుతో పాటు తమిళం, హిందీలో ‘ఆర్ఆర్ఆర్' సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీ సినిమా మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

     రూ. 200 కోట్లు శాటిలైట్

    రూ. 200 కోట్లు శాటిలైట్

    బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలకు మంచి క్రేజ్ ఏరపడింది. దీన్ని ఆధారంగా చేసుకుని తెలుగు, తమిళం, హిందీ శాటిలైట్ రైట్ష్, ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ఇలా అన్నీ కలిపి రూ. 200 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారట.

    రాజమౌళికి లాభాల్లో వాటా

    రాజమౌళికి లాభాల్లో వాటా

    ఇక రాజమౌళి ఈ సినిమా కోసం ముందుగా ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోడం లేదు. నిర్మాతకు పెట్టిన పెట్టుబడి తిరిగిన వచ్చిన తర్వాత వచ్చే లాభంలో షేర్ తీసుకునేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట.

     రామ్ చరణ్, ఎన్టీఆర్ సమానంగా

    రామ్ చరణ్, ఎన్టీఆర్ సమానంగా

    రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు సరిసమానంగా భారీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అది ఎంత మొత్తం? అనేది వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    English summary
    Film Nagar source said that, RRR team expected Rs. 600 Crores pre release business. While the theatrical rights of all languages will be around 400 Crores, the digital and satellite rights are likely to fetch close to 200 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X