twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ప్రమోషన్స్ నిలిపివేత.. రెండేళ్లలో మొట్టమొదటిసారిగా, మరో మెట్టు ఎక్కేశావంటూ మెచ్చుకుంటున్న నెటిజన్లు!

    |

    దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఉదయం ప్రమోషన్ మొదలు పెట్టిన ఈ సినిమా సాయంత్రానికి ఆపేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    పీవీ'ఆర్ఆర్ఆర్'గా నామకరణం


    ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం తమ లోగో మార్చేసింది ప్రముఖ మల్టీ ప్లెక్స్ థియేటర్ల చైన్ పీవీఆర్. తమ లోగో లోని చివరి 'ఆర్' స్థానంలో ఈ సినిమా పేరు చేర్చి.. పీవీ'ఆర్ఆర్ఆర్'గా నామకరణం చేసింది. ఈ కార్యక్రమం శుక్రవారం ముంబయిలోని అంధేరీలో జరగగా, కార్యకమంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య, ఆయన కుమారుడు కార్తికేయ హాజరయ్యారు. డైరెక్టర్ రాజమౌళి ఈ కొత్త లోగోను ఆవిష్కరించారు.

    పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా

    పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా

    ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్ , హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటీ ఒలివియా మోరీస్, నటి అలియా భట్ లు హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందుతోంది.

    జనవరి 7న

    జనవరి 7న

    ముందు దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా ప్రమోషన్ కోసం యూనిట్ కొత్తగా దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. పీవీఆర్ సినిమాస్‏కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‏ల పేరు PVRRR గా మార్పు చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు PVR సినిమాస్ PVRRR గా కనపడనుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక రికార్డు.

    వాయిదా వేస్తున్నామని

    వాయిదా వేస్తున్నామని

    ముందుగా పివిఆర్ సంస్థతో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించి సాయంత్రం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టాలి అని రాజమౌళి భావించారు. అందులో భాగంగానే సినిమా నుంచి విడుదలయ్యే గ్లిమ్ప్స్ కి సంబంధించిన ప్రకటన వస్తుందని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా సాయంత్రానికి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాలవల్ల ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈరోజు సాయంత్రం చేయడం లేదని వాయిదా వేస్తున్నామని సంస్థ ప్రకటించింది.

    Recommended Video

    Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
     నెటిజన్లు ప్రశంసల వర్షం

    నెటిజన్లు ప్రశంసల వర్షం

    అయితే ప్రతిసారీ ఇలా వాయిదా వేస్తున్నప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ను దారుణంగా ట్రోల్ వేసేవారు.. కానీ మొట్టమొదటిసారిగా దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఈ విషయంలో మాత్రం ఆర్ఆర్ఆర్ మేకర్స్ ను మెచ్చుకుంటున్నారు. మామూలుగా అయితే నువ్వు ఇలా వాయిదా ప్రకటన చేస్తుంటే మండిపోయేది కానీ ఈ సమయంలో కన్నడ సినీ పరిశ్రమలో జరిగిన విషాదాన్ని మన విషాదంగా భావించి వాయిదా వేశావు చూడు మరో మెట్టు ఎక్కేశావు.. చావు అంటూ ఆర్ఆర్ఆర్ సినిమా మేకర్స్ మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    English summary
    netizens hails RRR Team, due to Postponing Promotions on the wake of puneeth raj kumar demise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X