Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈ రేంజ్ సర్ ప్రైజ్ ఊహించని రామ్ చరణ్.. ఆనందంలో రాజమౌళిని హత్తుకున్న చెర్రీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. సోషల్ మీడియా, సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొదలైన వేడుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం శిల్పా కళా వేదికలో మెగా ఫ్యాన్స్ అంతా కలిసి రామ్ చరణ్ బర్త్ డేను సెలెబ్రేట్ చేశారు. ఇక నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ యూనిట్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ టీం రచ్చ
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. బర్త్ డే సందర్బంగా వదిలిన స్పెషల్ పోస్టర్ ఓ రేంజ్లో క్లిక్ అయింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించిన తీరుకు, ఆ విల్లు ఎక్కు పెట్టిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. అలా ఆర్ఆర్ఆర్ నిన్నటి నుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది.
కొంటె చూపుతో కాకపుట్టిస్తోంది.. మధురిమ ఫోటోలు వైరల్
రాత్రి పూట షూటింగ్..
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం రాత్రి పూట షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో యూనిట్ అంతా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి కూడా షూటింగ్ ఉండటం వల్లే శిల్పా కళా వేదికలో జరిగిన బర్త్ డే ఈవెంట్‌కు చెర్రీ రాలేకపోయాడు.
స్పెషల్ పార్టీ..
రామ్ చరణ్ బర్త్ డేను ఆర్ఆర్ఆర్ టీం స్పెషల్‌గా ప్లాన్ చేసింది. ఈ క్రమంలో నిన్న అర్దరాత్రి దాటాక రామ్ చరణ్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఇందులో రాజమౌళి, నిర్మాత దానయ్య అందరూ పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ వీడియోను ఆర్ఆర్ఆర్ టీం విడుదల చేసింది.
షాకైన చెర్రీ..
హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అనే అక్షరాలను ఒక్కసారిగా క్రేన్‌తో ఆకాశంలోకి లేపారు.. బాణా సంచాలతో ఆ క్షణాలను రంగులమయం చేసేసింది ఆర్ఆర్ఆర్ టీం. అయితే ఈ సర్ ప్రైజ్‌ను ఊహించని రామ్ చరణ్.. జక్కన్నను ఆనందంలో హత్తుకున్నాడు.కానీ ఇదంతా చేసింది కార్తికేయ అని చెప్పడంతో చెర్రీ మురిసిపోయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.