ఇప్పటికే చాలా నష్టం జరిగింది: RRR షూటింగ్ ప్లాన్ ఛేంజ్ చేసిన రాజమౌళి

Recommended Video

RRR Team To Plan, Back To Back Schedules Without Any Breaks | Ntr | Ramcharan | Rajamouli

బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం తగ్గకుండా 'RRR' పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా మొదలైన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలవ్వగా రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలై నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోయింది.

ఈ కారణంగా దాదాపు నెల రోజుల పాటు టైమ్ వేస్ట్ అయింది. దీని వల్ల ఇప్పటికే చాలా నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని కవర్ చేసేందుకు రాజమౌళి ఇకపై ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రాజమౌళి నిర్ణయానికి చరణ్, ఎన్టీఆర్ సై

రాజమౌళి నిర్ణయానికి చరణ్, ఎన్టీఆర్ సై

మరో వైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం వీలైనంత తర్వగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. రాజమౌళి సూచన మేరకు ఎలాంటి విరామం లేకుండా షూటింగులో పాల్గొనేందుకు వారు అంగీకరించినట్లు సమాచారం. RRR పూర్తయితే వారితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

టార్గెట్ రీచ్ అయ్యేలా

టార్గెట్ రీచ్ అయ్యేలా

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి నిర్ణయించారు. ఒక వేళ అనుకున్న సమయానికి షూట్ పూర్తికాపోతే జనవరి 2020లో కూడా ఈ ఇద్దరితో షూటింగ్ జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సమాంతరంగా విఎఫ్ఎక్స్ వర్క్

సమాంతరంగా విఎఫ్ఎక్స్ వర్క్

ఓ వైపు షూటింగ్ జరుపుతూనే సమాతరంగా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా మొదలు పెట్టారు. రాజమౌళి ఇందుకు సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను నియమించుకున్నారట.

ఫారిన్ బ్యూటీ ఎంపిక సీక్రెట్

ఫారిన్ బ్యూటీ ఎంపిక సీక్రెట్

మరో వైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు మొదట ఎంపికైన బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరొకరిని ఎంపిక చేశారు. అయితే ఆమె ఎవరు? అనేది బయటకు రాలేదు. త్వరలోనే ఈ విషయమై చిత్ర బృందం నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. 1920 కాలం నాటి బ్రిటిష్ బ్యాక్ డ్రాపుతో ఫిక్షన్ స్టోరీతో ఈ చిత్రం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా కావడంతో అజయ్ దేవగన్, సముద్రఖని లాంటి ఇతర భాషా నటులను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 30, 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X