For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రాముడు రుద్రుడు రణరంగం'.. పవర్ ఫుల్ టైటిల్స్ ట్వీట్ చేసిన RRR యూనిట్!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ గాయానికి గురి కావడంతో RRR షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. మరోవైపు జూ. ఎన్టీఆర్ కూడా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా త్వరలో RRR షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ చిత్రానికి టైటిల్ RRR అని రాజమౌళి ఖరారు చేశారు. పూర్తి టైటిల్ మాత్రం అన్ని భాషలలో అభిమానుల నుంచి స్వీకరించనున్నట్లు తెలిపారు. తాము అనుకుంటున్న టైటిల్ కంటే ఫ్యాన్స్ పంపిన టైటిల్ బావుందని అనిపిస్తే దానినే ఖరారు చేస్తాం అని రాజమౌళి తెలిపారు. తాజాగా మరోమారు RRR చిత్ర యూనిట్ టైటిల్స్ గురించి స్పందించింది.

    అంచనాలు పెరుగుతున్నాయి

    అంచనాలు పెరుగుతున్నాయి

    తాజాగా RRR చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అన్ని భాషల్లో RRR చిత్రంపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి అని పేర్కొన్నారు. RRRకు పూర్తి టైటిల్ పంపాలని అభిమానులని అడిగిన రోజునుంచి ఇప్పటివరకు చాలా టైటిల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని పవర్ ఫుల్ గా ఉన్నాయి, కొన్ని ఉత్కంఠ రేకెత్తించే విధంగా, మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని తెలిపారు. ఇంకా పంపిస్తూ ఉండండి.. ఎవరికి తెలుసు.. మీరు పంపిన టైటిలే ఎంపిక కావచ్చు అని పేర్కొన్నారు.

    రాముడు రుద్రుడు రణరంగం

    రాముడు రుద్రుడు రణరంగం

    ఇప్పటివరకు అభిమానులు పంపిన టైటిల్స్ లో కొన్నింటిని ట్వీట్ చేశారు. రఘుపతి రాఘవ రాజా రామ్, రాముడు రుద్రుడు రణరంగం, రాయల్ ర్యాంపేజ్ ఆఫ్ రెబల్స్, రణమున రగిలిన రుధిరం, రామ రాజ్య రక్షక, రైజ్ రోర్ రివోల్ట్ లాంటి టైటిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ భాషల నుంచి వచ్చిన ఆసక్తికరమైన టైటిల్స్ ని RRR యూనిట్ ట్వీట్ చేసింది.

     దేశం మొత్తం

    దేశం మొత్తం

    రాజమౌళి RRR చిత్రాన్ని 1920 బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన తర్వాత దేశం మొత్తం ఈ చిత్రం గురించి చర్చ మొదలైంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం కోసం సినీ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం ఇద్దరూ అదృశ్యమైన తర్వాత జరిగిన కథని రాజమౌళి కల్పితగాధగా తెరకెక్కిస్తున్నారు.

    బాలీవుడ్ నటీనటులు

    రాజమౌళి RRR చిత్రంలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ ని కూడా ఎంపిక చేసుకున్నారు. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించారు. అలియా భట్ రాంచరణ్ కు జోడిగా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ కు హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు.

    English summary
    RRR team tweets some of powerful titles from fans. NTR and Ram Charan playing main leads in this movie. DVV Danayya producing it in 400 cr budget
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X