RRR రికార్డుల వేట మొదలు: చరిత్ర సృష్టించిన తొలి తెలుగు సినిమా.. ఒక్కదెబ్బతో అవన్నీ వెనక్కి.!

By Manoj Kumar P

తెలుగులో మల్టీస్టారర్ మూవీలకు ఈ మధ్య మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం.. దర్శకులు కూడా సరికొత్త ప్రయోగాలకు సిద్ధం అవుతుండడం వంటి కారణాలతో టాలీవుడ్‌లో వరుసగా ఆ సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ హంగులతో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ RRR. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న ఈ మూవీ రికార్డుల వేటను ప్రారంభించింది. ఒకే ఒక్క దానితో టాలీవుడ్‌లో హిస్టరీని తిరగరాసింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

 రియల్ హీరోల కోసం ఇద్దరు స్టార్లు దిగారు

రియల్ హీరోల కోసం ఇద్దరు స్టార్లు దిగారు

‘బాహుబలి' తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా.. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు కథల ఆధారంగా రూపొందుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఆలియా, ఒలీవియా హీరోయిన్లు కాగా, చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

చాలా అయింది.. అసలైంది మిగిలిపోయింది

చాలా అయింది.. అసలైంది మిగిలిపోయింది

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పైగానే అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం మాత్రమే పూర్తయింది. మిగిలిన భాగంలోనే ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లను చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన సీన్స్ అన్నీ అదిరిపోయేలా వచ్చాయని ప్రచారం జరుగుతోంది.

ఆటంకాలు.. ఫ్యాన్స్ గగ్గోలు.. చివరికిలా ప్లాన్

ఆటంకాలు.. ఫ్యాన్స్ గగ్గోలు.. చివరికిలా ప్లాన్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అందుకే షూటింగ్ ఆలస్యం అయిందన్న టాక్ ఉంది. ఈ కారణంగానే ఒక్క సర్‌ప్రైజ్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సినిమా టైటిల్‌తో కూడిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

అప్పటి నుంచి మొదలైన అనుమానాలు

అప్పటి నుంచి మొదలైన అనుమానాలు

RRR షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించాలని జక్కన్న భావిస్తున్న తరుణంలో కరోనా రూపంలో మరో ఆటంకం ఎదురైంది. ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడుతుందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, మోషన్ పోస్టర్‌లో రిలీజ్ డేట్‌ను జనవరి 8, 2021 అని ప్రకటించడంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడింది.

సర్‌ప్రైజ్ వచ్చేసింది.. రెస్పాన్స్ రాబట్టింది


మోషన్ పోస్టర్ విడుదల చేసిన రెండో రోజే RRR యూనిట్ నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో అల్లూరిగా చెర్రీ లుక్ ఆకట్టుకుంది. అలాగే, నాలుగు భాషల్లో ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

దీంతోనే RRR రికార్డుల వేట మొదలు

దీంతోనే RRR రికార్డుల వేట మొదలు


‘భీమ్ ఫర్ రామరాజు' పేరిట వచ్చిన వీడియోకు అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. మరీ ముఖ్యంగా వేగంగా (28 గంటలు) ఐదు లక్షల లైకులు సాధించిన తొలి తెలుగు సినిమాగా RRR నిలిచింది. ఈ క్రమంలోనే సాహో (35 గంటలు), అల.. వైకుంఠపురములో (4 రోజులు), సరిలేరు (6 రోజులు) రికార్డులు బద్దలైపోయాయి.

Recommended Video

RRR | Audience Blown Away By Jr NTR Voice Over
అవి కూడా రికార్డులే.. తొలి తెలుగు సినిమా

అవి కూడా రికార్డులే.. తొలి తెలుగు సినిమా

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. తొలి 24 గంటల్లో తెలుగులో 7.09 మిలియన్, హిందీలో 5.10 మిలియన్, కన్నడలో 1.40 మిలియన్, తమిళంలో 1.32 మిలియన్, మలయాళంలో 0.56 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, 17 నిమిషాల్లోనే లక్ష లైకులు సాధించిన తొలి తెలుగు సినిమా టీజర్‌గా ఇది రికార్డులకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X