RRR Trailer: వకీల్ సాబ్‌ను దాటలేకపోయిన ఆర్ఆర్ఆర్.. ఇంకా పవన్ కంట్రోల్‌లోనే అరుదైన రికార్డు
దేశమే మెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఖర్చుకు వెనుకాడని నిర్మాత డీవీవీ దానయ్య.. టాప్ మోస్ట్ టెక్నీషియన్లు.. వీళ్లందరి కలయికలో వస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. దీంతో అన్ని ఇండస్ట్రీలూ దీనిపై బాగానే ఫోకస్ చేశాయి. అందుకు అనుగుణంగానే అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేసిన దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ వీడియో వకీల్ సాబ్ రికార్డును మాత్రం దాటలేకపోయింది. ఆ వివరాలు మీకోసం!

రియల్ హీరోల కథతో వస్తున్న RRR
తెలుగు గడ్డపై పుట్టిన రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిస్తోన్న మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తున్నారు.

ముందుగానే రిలీజైన RRR ట్రైలర్
RRR మూవీ నుంచి కొంత కాలంగా వరుసగా పాటలు, గ్లిమ్స్, టీజర్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను వదులుతామని యూనిట్ ప్రకటించింది. దీన్ని ముందుగా థియేటర్లలో, ఆ తర్వాత అంటే ఆరు గంటల గ్యాప్‌లో యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ, గంట వ్యవధిలోనే ఈ ట్రైలర్‌ను తీసుకుని వచ్చేశారు.
అదిరిన ట్రైలర్.. ఓ రేంజ్ రెస్పాన్స్
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన RRR మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ వీడియోకు యూట్యూబ్‌లో అత్యధికంగా వ్యూస్, లైకులు కూడా దక్కుతున్నాయి.

సెలెబ్రిటీలు నుంచి భలే స్పందన
ఇండియాలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR మూవీపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు సెలెబ్రిటీలు కూడా జేజేలు పలుకుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాదు.. అన్ని పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు దీనిపై ట్వీట్లు చేస్తున్నారు.

వకీల్ సాబ్‌ను దాటలేకపోయిన RRR
RRR మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ట్రైలర్‌కు తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్, లైకులు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది. దీంతో చాలా సినిమాల రికార్డులు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ, RRR ట్రైలర్ పవన్ నటించిన వకీల్ సాబ్‌ను మాత్రం దాటలేకపోయింది.

పవన్ కంట్రోల్‌లోనే అరుదైన రికార్డు
RRR మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌కు లైకులు కూడా భారీగానే వస్తున్నాయి. అయితే, వేగంగా 100K లైకులు అందుకున్న చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానానికే పరిమితం అయింది. వకీల్ సాబ్ ట్రైలర్ ఏడు నిమిషాల్లోనే 100K లైకులు సొంతం చేసుకోగా.. RRR ట్రైలర్ మాత్రం ఎనిమిది నిమిషాల్లో ఈ మార్కును చేరుకుంది. దీంతో ఈ రికార్డు పవన్ పేరిటే ఉండిపోయింది.
Recommended Video

హవా చూపిస్తూ.. అన్నీ రికార్డులూ బ్రేక్
RRR ట్రైలర్ 100K లైకుల రికార్డును బ్రేక్ చేయలేకపోయింది కానీ.. 200k లైకులను 18 నిమిషాల్లో.. 300K లైకులను 32 నిమిషాల్లో.. 400K లైకులను 52 నిమిషాల్లో.. 500K లైకులను ఒక గంట, ఇరవై నిమిషాల్లో సొంతం చేసుకుంది. తద్వారా 100K మినహా ప్రతీ మార్కును ముందుగానే చేరుకుంది. దీంతో అదొక్కటి తప్ప అన్నింట్లోనూ హవా చూపించి రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











