RRR Trailer: రికార్డులను ర్యాంప్ ఆడించిన ట్రైలర్.. ఇండియాలో నెంబర్ వన్.. తెలుగులో మాత్రం రెండోదే!

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. 'బాహుబలి'తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ రేంజ్ ఖండాంతరాలు దాటిపోయింది. అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమా నుంచి గురువారమే ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేసిన దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో 24 గంటల్లోనే ఇది రికార్డు స్థాయిలో వ్యూస్, లైకులను సొంతం చేసుకుంది. తద్వారా నేషనల్ రేంజ్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఆ లెక్కలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

రియల్ హీరోలుగా మారిన స్టార్ హీరోలు

రియల్ హీరోలుగా మారిన స్టార్ హీరోలు

తెలుగు రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిస్తోన్న మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తోన్న విషయం తెలిసిందే.

 అదిరిన ట్రైలర్.. భారీ స్థాయి రెస్పాన్స్

అదిరిన ట్రైలర్.. భారీ స్థాయి రెస్పాన్స్

భారీ అంచనాల నడుమ విడుదలైన RRR మూవీ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్‌పై సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు సైతం స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

RRR మూవీ ట్రైలర్‌.. 24 గంటల్లో ఇలా

RRR మూవీ ట్రైలర్‌.. 24 గంటల్లో ఇలా

RRR మూవీ ట్రైలర్‌‌ ఐదు భాషల్లో విడుదలైంది. అందులో తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది మంచి స్పందనను అందుకుంది. ఫలితంగా 24 గంటల్లోనే 20.45 మిలియన్ వ్యూస్‌తో పాటు 1.24 మిలియన్ లైకులను కూడా అందుకుంది. దీంతో ఎన్నో రికార్డులను సైతం ఈ ట్రైలర్ తిరగరాసింది.

 RRR మూవీ ట్రైలర్‌.. ఏ భాషలో ఎన్ని

RRR మూవీ ట్రైలర్‌.. ఏ భాషలో ఎన్ని

RRR మూవీ ట్రైలర్‌ 24 గంటల్లో తెలుగులో 20.45 మిలియన్ వ్యూస్‌తో పాటు 1.24 మిలియన్ లైక్స్ వచ్చాయి. అలాగే, హిందీలో 19.80 మిలియన్ వ్యూస్‌తో పాటు 805K లైక్స్, తమిళంలో 3.25 మిలియన్ వ్యూస్‌తో పాటు 206K లైక్స్, కన్నడంలో 5.20 మిలియన్ వ్యూస్‌తో పాటు 141K లైక్స్, మలయాళంలో 2.42 మిలియన్ వ్యూస్‌తో పాటు 180K లైక్స్ వచ్చాయి.

తెలుగులో రెండో స్థానం.. అందులో ఫస్ట్

తెలుగులో రెండో స్థానం.. అందులో ఫస్ట్

RRR మూవీ ట్రైలర్‌ 24 గంటల్లోనే 20.45 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడం ద్వారా తెలుగులో ఎక్కువ వ్యూస్‌ను సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. దీనికంటే ముందు 'బాహుబలి' 21.81 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఇక, ఈ చిత్ర ట్రైలర్ 1.24 మిలియన్ లైకులను అందుకోవడంతో తెలుగులో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

సౌత్ ఇండియాలో రెండో స్థానానికి చేరిక

సౌత్ ఇండియాలో రెండో స్థానానికి చేరిక

24 గంటల్లోనే 20.45 మిలియన్ వ్యూస్‌తో పాటు 1.24 మిలియన్ లైకులను అందుకున్న RRR మూవీ ట్రైలర్‌ సౌత్ ఇండియా రేంజ్‌లో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ కూడా వ్యూస్‌ పరంగా మొదటి స్థానంలో 'బాహుబలి' ఉంది. అయితే, లైకుల విషయంలో మాత్రం 1.66 మిలియన్ లైకులతో 'బిగిల్' మొదటి స్థానంలో ఉండగా.. RRR రెండో స్థానానికి చేరుకుంది.

 ఇండియాలోనే మొదటి స్థానంలో RRR

ఇండియాలోనే మొదటి స్థానంలో RRR

తెలుగులో రెండో స్థానానికే పరిమితం అయిన RRR మూవీ ట్రైలర్‌.. ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మొదటి స్థానంలో నిలిచింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్ర ట్రైలర్‌కు 51 మిలియన్ పైచిలుకు వ్యూస్ వచ్చాయి. దీంతో 'సాహో' పేరిట ఉన్న 51 మిలియన్ వ్యూస్ రికార్డును దాటేసింది. అంతేకాదు, వేగంగా 50 మిలియన్ వ్యూస్‌ను అందుకుని రికార్డు కొట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X