RRR Trailer: నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని కొడదాం పదా.. యుద్ధం తెల్లదొరలపై కాదు.. బాక్సాఫీస్‌పై!
బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్రంతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఈ దర్శకధీరుడు.. అన్ని ఇండస్ట్రీలూ టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. అంతేకాదు, తెలుగు సినిమా బాహుబలికి ముందూ తర్వాత అనేంతగా ప్రభావాన్ని చూపించాడు. ఈ జోష్‌తోనే ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం? దీనిపై మీరూ ఓ లుక్కేయండి మరీ!

విప్లవ వీరులుగా మారిన హీరోలు
స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా చేస్తున్న విషయం తెలిసిందే.

ట్రైలర్ డే అంటూ సంబరాలతో
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRR మూవీని వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి పాటలు, గ్లిమ్స్ వీడియోలు వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్‌ను కూడా ఈరోజు తీసుకు వస్తున్నారు. ఇందుకోసం కొద్ది రోజుల ముందు నుంచే పలు రకాల అప్‌డేట్లను కూడా ఇస్తూ వస్తున్నారు.

ముందు అక్కడ రిలీజ్ చేశారు
RRR మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది. అంతేకాదు, ఉదయం 10 గంటలకు థియేటర్లలో.. సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్‌లో వదులుతామని చెప్పింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే సినిమా హాళ్లలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అక్కడ ప్రేక్షకులతో సినిమా విడుదల వాతావరణం కనిపించింది.

టైం మార్చిన సర్‌ప్రైజ్ చేశారు
థియేటర్లలో RRR ట్రైలర్‌ను పది గంటలకు విడుదల చేశారు. అయితే, సాయంత్రం నాలుగు గంటలకు యూట్యూబ్‌లో రావాల్సిన ట్రైలర్‌ను ముందుగానే విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అది వచ్చిన గంటకే అంటే ఉదయం 11 గంటలకే దీన్ని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అది విడుదలయ్యే యూట్యూబ్ ఛానెళ్ల పేర్లను కూడా షేర్ చేసేశారు.

గూస్‌బమ్స్ RRR మూవీ ట్రైలర్
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న RRR ట్రైలర్ వచ్చేసింది. ముందుగా థియేటర్లలో విడుదలైన ఈ వీడియో.. ఇప్పుడు యూట్యూబ్‌లోకి కూడా వచ్చేసింది. మొదట ఇద్దరు హీరోలను అదిరిపోయే ఎలివేషన్‌తో పరిచయం చేసిన రాజమౌళి.. ఆ తర్వాత అద్భుతమైన విజువల్స్‌తో కట్టిపడేశాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ను హైలైట్ చేశాడు.
వాళ్లిద్దరూ ఎలా కలిశారో చూపిస్తూ
పోలీస్‌గా కనిపిస్తున్న రామరాజు.. అడవిలో ఉండే కొమరం భీం ఎలా కలిశారు? అసలు వీళ్లిద్దరూ ఎందుకు కలవాల్సి వచ్చింది? తెల్లవాళ్లపై జంటగా పోరాటం ఎందుకు చేశారు? అన్న అంశాలను చూపిస్తూ ఈ ట్రైలర్‌ను చూపించారు. ట్రైలర్ ద్వితియార్థంలో వచ్చే పోరాట సన్నివేశాలు అబ్బరుపరిచేలా ఉన్నాయి. దీనికి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్నిచ్చింది.

ఆ కుంభస్థలాన్ని కొడదాం పదా
ట్రైలర్ చివర్లో విల్లు పట్టుకుని తెల్ల దొరలపై పోరాటం చేస్తున్నా రామరాజు.. తన బలంతో శత్రువులను చిత్తు చేస్తున్న కొమరం భీంతో 'ఈ నక్కల వేట ఎంతసేపు... కుంభస్థలాన్ని కొడదాం పదా' అంటూ చెప్పే డైలాగ్ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. ఇక, ఆ తర్వాత ఇద్దరూ కలిసి చేసే పోరాట ఘట్టాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక, లాస్ట్ షాట్ అయితే ట్రైలర్‌కే హైలైట్ అని చెప్పొచ్చు.
Recommended Video

ట్రైలర్‌లో ఉన్న హైలైట్లు ఇవే
తాజాగా విడుదలైన RRR ట్రైలర్‌ను చూసుకుంటే.. ఇందులో ఇద్దరు హీరోల పరిచయం సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, ఎమోషన్స్ అన్నీ హైలైట్ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ నిడివి ఉన్నా అద్భుతంగా దీన్ని కట్ చేసిన రాజమౌళిని మెచ్చుకోవాలి. ఇద్దరు హీరోల స్నేహబంధాన్ని చక్కగా చూపిన ఈ ట్రైలర్‌పై మీరూ లుక్కేయండి!


Click it and Unblock the Notifications











