RRR: మరో గొప్ప రికార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఇండియాలోనే మొట్టమొదటి స్థానం సొంతం
తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో కెల్లా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ రేంజ్ ఎల్లలు దాటిపోయింది. అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమా నుంచి ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేసిన దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది రికార్డు స్థాయిలో వ్యూస్, లైకులను సొంతం చేసుకుంది. తద్వారా నేషనల్ రేంజ్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో రికార్డును బ్రేక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

విప్లవ హీరోలుగా మారిన స్టార్ హీరోలు
తెలుగు గడ్డపై పుట్టిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిస్తోన్న మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తోన్నారు.

అదిరిన ట్రైలర్... ఓ రేంజ్ రెస్పాన్స్
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన RRR మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్‌పై సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఈ ట్రైలర్‌కు ఫిదా అయిపోయారు కూడా.

RRR మూవీ ట్రైలర్.. ఒక్క రోజులోనే
RRR మూవీ ట్రైలర్ ఐదు భాషల్లో విడుదలైంది. అందులో తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది మంచి స్పందనను అందుకుంది. ఫలితంగా 24 గంటల్లోనే 20.45 మిలియన్ వ్యూస్‌తో పాటు 1.24 మిలియన్ లైకులను కూడా అందుకుంది. దీంతో ఎన్నో రికార్డులను సైతం ఈ ట్రైలర్ తిరగరాసేసింది.

తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా
RRR మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో అయితే ఇది భారీ స్పందనతో దూసుకుపోతోంది. ఫలితంగా ఎన్నో వ్యూస్, లైకులను సొంతం చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ హిందీలో మించిన స్పందనను దక్కించుకుంటోంది. దీంతో ఇక్కడి కంటే అక్కడ ఎక్కువ వ్యూస్, సమానంగా లైకులు కూడా దక్కుతున్నాయి.

మరో గొప్ప రికార్డును అందుకుందిగా
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న RRR మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు రోజులు గడుస్తున్నా స్పందన మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో ఇది వేగంగా ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ వెళ్లిపోతోంది. ఈ క్రమంలోనే RRR మూవీ ట్రైలర్ ఏకంగా వంద మిలియన్ల వ్యూస్‌ను అందుకుని మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
Recommended Video

ఇండియాలోనే మొట్టమొదటి స్థానం
RRR మూవీ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి వంద మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ట్రైలర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వేగంగా వంద మిలియన్ల వ్యూస్‌ను అందుకున్న ట్రైలర్‌గా ఇది రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా లెవెల్ మరింతగా పెరిగిపోయిందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











