RRR: మరో సంచలన రికార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఇండియాలోనే నెంబర్ వన్ స్థానం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో అప్పటి నుంచి టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక, ఇప్పుడు అదే దర్శకుడు పాన్ వరల్డ్ మూవీతో రాబోతున్నాడు. అదే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది.

అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా RRR మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుని.. ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ సంగతులు మీకోసం!

రియల్ హీరోలుగా టాలీవుడ్ స్టార్లు

రియల్ హీరోలుగా టాలీవుడ్ స్టార్లు

తెలుగు రాష్ట్రాలకు చెందిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను చేస్తున్నారు.

ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ కూడా

ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ కూడా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR మూవీని 2020లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇది పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా చాలా డేట్లను ప్రకటించినా విడుదల కాలేదు. ఇక, సంక్రాంతికి తీసుకు రావాలని అనుకున్నా సాధ్య పడలేదు. దీంతో ఈ సినిమాను మార్చి 25న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అదిరిన ట్రైలర్.. భారీగా రెస్పాన్స్‌

అదిరిన ట్రైలర్.. భారీగా రెస్పాన్స్‌

RRR మూవీపై దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో బజ్ ఉంది. దీంతో ఈ చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీనిపై సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు.

RRR మూవీ ట్రైలర్‌.. ఒక్క రోజులో

RRR మూవీ ట్రైలర్‌.. ఒక్క రోజులో

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన RRR మూవీ ట్రైలర్‌‌ ఐదు భాషల్లో విడుదలైంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది మంచి స్పందనను అందుకుంది. ఫలితంగా 24 గంటల్లోనే 20.45 మిలియన్ వ్యూస్‌తో పాటు 1.24 మిలియన్ లైకులను కూడా అందుకుంది. దీంతో ఎన్నో రికార్డులను సైతం ఈ ట్రైలర్ తిరగరాసేసింది. అదే సమయంలో అంచనాలు సైతం రెట్టింపు అయిపోయాయి.

మనకంటే అక్కడే ఎక్కువ వ్యూస్

మనకంటే అక్కడే ఎక్కువ వ్యూస్

ప్రతిష్టాత్మక చిత్రం RRR ట్రైలర్‌‌కు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగులో కంటే హిందీలో దీనికి మరింత ఎక్కువ స్పందన దక్కింది. ఫలితంగా ఎన్నో వ్యూస్, లైకులను సొంతం చేసుకుంటోంది. అలాగే, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లోనూ ఇది భారీ స్పందనను దక్కించుకుంది. ఫలితంగా అన్ని భాషల్లోనూ బజ్‌ను విశేషంగా ఏర్పరచుకుంది.

మరో గొప్ప రికార్డును అందుకుంది

మరో గొప్ప రికార్డును అందుకుంది

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న RRR మూవీ నుంచి ఆ మధ్య విడుదలైన ట్రైలర్‌కు రోజులు గడుస్తున్నా స్పందన మాత్రం పెరుగుతోంది. దీంతో ఇది వేగంగా ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే RRR మూవీ ట్రైలర్ ఏకంగా 150 మిలియన్ల వ్యూస్‌ను అందుకుని తాజాగా మరో అరుదైన రికార్డును నమోదు చేసింది.

ఇండియాలో మొట్టమొదటి స్థానం

ఇండియాలో మొట్టమొదటి స్థానం

భారీ మల్టీస్టారర్‌గా వస్తున్న RRR మూవీ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి తాజాగా 150 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ట్రైలర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వేగంగా 150 మిలియన్ల వ్యూస్‌ను అందుకున్న ట్రైలర్‌గా ఇది రికార్డును క్రియేట్ చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X