twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR trailer: పులితో రాజమౌళి బాక్సాఫీస్ వేట.. ట్రైలర్ నిడివి ఎంత, హైలెట్స్ ఎమిటో తెలుసా?

    |

    బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సంచలన దర్శకుడిగా పేరు సంపాదించుకొన్న ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం రిలీజ్‌కు సర్వం సిద్దమవుతున్నది. గురువారం రోజున ఆవిష్కరించే ట్రైలర్‌తో RRR సినిమా ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు జక్కన్న ప్రయత్నాలు మొదలుపెట్టారు. బుధవారం రిలీజ్ చేయబోయే ట్రైలర్ గురించిన ఆసక్తికరమైన విషయాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఆ విషయాల్లోకి వెళితే..

    పలుమార్లు వాయిదా పడిన RRR

    పలుమార్లు వాయిదా పడిన RRR


    RRR చిత్రాన్ని ప్రారంభించిన సమయంలో నిర్ణయించుకొన్న రిలీజ్ డేట్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో నటించిన రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గాయాల బారిన పడటం, కరోనావైరస్ పరిస్థితుల వల్ల లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగు వాయిదా పడటంతో రిలీజ్ అనేక డేట్లు మారుకుంటూ చివరకు జనవరి 7 తేదీని ఫిక్స్ చేశారు.

    నాలుగు నగరాల్లో ట్రైలర్ రిలీజ్

    నాలుగు నగరాల్లో ట్రైలర్ రిలీజ్

    RRR సినిమా ట్రైలర్ కోసం చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేపట్టింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్స్‌ను భారీగా ఏర్పాటు చేసింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో తొలుత మీడియా సమావేశాలను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 9న ముంబైలో 12 గంటలకు, హైదరాబాద్‌లో 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిత్రంలోని నటీనటులు మీడియా ముందుకు రానున్నారు. ఇక డిసెంబర్ 10వ తేదీన బెంగళూరులో 11 గంటలకు, చెన్నైలో సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశంలో టీమ్ మొత్తం పాల్గొంటారని తెలిసింది. ఈ సమావేశంలో ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు.

    ట్రైలర్‌లో పులి ఫైట్ హైలెట్‌గా

    ట్రైలర్‌లో పులి ఫైట్ హైలెట్‌గా

    మెగా, నందమూరి, సినీ అభిమానులను, సినీ ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలను దర్శకుడు రాజమౌళి భారీగా జొప్పించినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంలోని పులితో పోరాటం సీన్‌ను ట్రైలర్‌లో హైలెట్‌గా చూపించబోతున్నట్టు తెలిసింది. పులి ఫైట్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా తెరకెక్కించారనే ప్రచారం ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేపింది. అంతేకాకుండా ట్రైలర్‌లో ఉత్తరాదిని వారిని ఆకర్షించేందుకు ఆలియా, అజయ్ దేవగన్ సీన్లను కూడా చేర్చినట్టు సమాచారం.

    RRR ట్రైలర్ నిడివి ఎంతంటే?

    RRR ట్రైలర్ నిడివి ఎంతంటే?

    RRR చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌‌ నిడివి కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలిసింది. ఈ ట్రైలర్ నిడివి మూడు నిమిషాల కంటే ఎక్కువగానే ఉందని ప్రాథమిక సమాచారం. ఈ సినిమా ట్రైలర్‌ను 184 సెకన్లు ఉండేలా కట్ చేశారు. భారీగా ఎమోషన్స్ కనిపించేలా సీన్లను ట్రైలర్‌ పెట్టారు. ప్రముఖ తారలందర్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకొన్నారనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    RRR బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్

    RRR బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్


    RRR సినిమాను భారీ బడ్జెట్ రూపొందించారు. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తొలుత 400 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేశారు. అయితే కరోనావైరస్, ఇతర పరిస్థితుల కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా సుమారు 500కుపైగానే బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం. బడ్జెట్‌కు తగినట్టుగా ఈ సినిమా 1000 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే ప్రచారం జరుగుతున్నది.

    Recommended Video

    RRR : That's Ram, Bheem | RRR Latest Posters || Filmibeat Telugu
    RRR‌లో నటీనటులు: సాంకేతిక నిపుణులు

    RRR‌లో నటీనటులు: సాంకేతిక నిపుణులు

    నటీనటులు: ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రీయ సరన్, ఓలియా మోరిస్, అలిసన్ డూడీ,, రే స్టీవెన్‌సన్ తదితరులు
    దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
    నిర్మాత: డీవీవీ దానయ్య
    డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
    సినిమాటోగ్రఫి: కేకే సెంథిల్ కుమార్
    ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
    మ్యూజిక్: ఎంఎం కీరవాణి
    బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
    డిస్ట్రిబ్యూషన్: లైకా ప్రొడక్షన్స్ (తమిళం), పెన్ స్టూడియోస్ (నార్త్)
    రిలీజ్ డేట్: 2021-10-13

    English summary
    SS Rajamouli's RRR trailer is releasing today at mumbai, SS Rajamouli's sets curiosity worldwide with his trailer. This movie is set to release on January 7th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X