Don't Miss!
- News
భారత్ బయోటెక్ నుంచి కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది- అక్కడే అందుబాటులో
- Sports
INDvsAUS : మాజీ ఆసీస్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే సమాధానం.. నోటమాట రాలేదుగా!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Critics Choice Awards: RRR మరో సంచలనం.. ఒకేసారి రెండు అవార్డులు.. ఏకైక ఇండియన్ మూవీగా రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలో రూపొందినా ప్రపంచ వ్యాప్తంగా హవాను చూపించి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి వేయి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాగే, పలు మాధ్యమాల ద్వారా ప్రపంచం మొత్తం హైలైట్ అయింది. దీంతో ఈ చిత్రానికి వరుసగా అవార్డులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు క్రిటిక్ ఛాయిస్ అవార్డుల్లో RRR సత్తా చాటింది. ఇందులో ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకుని రికార్డును సాధించింది. ఆ పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

స్టార్ హీరోలతో రాజమౌళి రచ్చ
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను చేశారు.
హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో

ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్
చాలా
రోజుల
పాటు
థియేటర్లలో
RRR
(రౌద్రం
రణం
రుధిరం)
సినిమా
భారీ
ప్రభావాన్ని
చూపించిదని
అందరికీ
తెలిసిందే.
అదే
సమయంలో
ఓటీటీలోనూ
ఈ
మూవీ
అదే
దూకుడును
ప్రదర్శించింది.
ఫలితంగా
స్ట్రీమింగ్
చేసిన
జీ5,
నెట్‌ఫ్లిక్స్,
డిస్నీ
హాట్‌స్టార్‌లలో
రికార్డు
స్థాయిలో
వ్యూస్
కూడా
దక్కాయి.
దీంతో
ప్రపంచ
వ్యాప్తంగా
ట్రెండ్
అవుతూ
అందరి
దృష్టిలో
పడింది.

ఎన్నో అవార్డులు.. గోల్డెన్ గ్లోబ్
RRR మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ దక్కించుకుంది.
బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

క్రిటిక్స్ ఛాయిస్.. ఐదింటిలో
ప్రపంచ
వ్యాప్తంగా
ఎన్నో
అవార్డులను
సొంతం
చేసుకున్న
RRR
మూవీ
మరో
ప్రతిష్టాత్మకమైన
క్రిటిక్స్
ఛాయిస్
అవార్డుల్లో
ఐదు
విభాగాల్లో
నామినేట్
అయింది.
అందులో
బెస్ట్
పిక్చర్,
బెస్ట్
డైరెక్టర్,
బెస్ట్
ఫారిన్
లాంగ్వేజ్
ఫిల్మ్,
బెస్ట్
విజువల్
ఎఫెక్ట్స్,
బెస్ట్
సాంగ్
కేటగిరీలు
ఉన్నాయి.
ఫలితంగా
ఇలా
ఐదు
కేటగిరీల్లో
నామినేట్
అయిన
ఇండియన్
సినిమాగా
ఇది
రికార్డు
సాధించింది.
|
మరోసారి ఆ పాటకు అవార్డు
RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ చాలా దేశాల్లో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ పాటకు చాలా అవార్డులు దక్కాయి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా ఆ సాంగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతోన్న క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో నాటు నాటు బెస్ట్ సాంగ్‌గా ఎంపికైంది. కీరవాణి ఈ అవార్డు తీసుకున్నారు.
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

బెస్ట్ మూవీగానూ ఎంపికైంది
క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీ కూడా పలు విభాగాల్లో చాలా అవార్డులను నామినేట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో బెస్ట్ ఫారెన్ లాగ్వేజ్ మూవీ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలిసి స్టేజ్ మీదకు వెళ్లి అందుకున్నారు.

మిగిలింది ఆస్కార్ మాత్రమే
2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తాజాగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలను ఉంచింది. వాటిలో RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కూడా చోటు దక్కించుకుంది. దీంతో అందులోనూ ఈ చిత్రం అవార్డును అందుకుంటుందని తెలుగు ప్రేక్షకులంతా ఆశాభావంతో ఉన్నారని చెప్పొచ్చు.