NTR vs Ram Charan in RRR: హీరోల ఎమోషనల్ ఫైట్, వాళ్ళు కొట్టుకుంటే నేనే తట్టుకోలేదు..ఇక ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో!

RRR వెండితెరపైకి ఎప్పుడు వస్తుందో గాని ఆ సినిమాపై పెరుగుతున్న అంచనాలు మాత్రం మాములుగా లేవు. దానికి తోడు ఇటీవల సినిమా కథ రచయిత విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. అందులో ఉండే ఎమోషనల్ ఫైట్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మరింత క్లారిటిగా వివరణ ఇచ్చారు. ఫైట్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా భావోద్వేగానికి గురి చేయడం కాయమని తెలుస్తోంది.

 సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే..

సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే..

కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే ఈపాటికే సినిమా సందడి మొదలయ్యి ఉండేది. సినిమా మేకింగ్ వీడియోలు, టీజర్లు, పోస్టర్లు అంటూ అభిమానులకు రోజుకో సర్ ప్రైజ్ ఇచ్చేవారు. రాజమౌళి ప్రమోషన్ డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ కరోనా లాక్ డౌన్ వలన ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఎలాంటి విషయాలు లీక్ చేయవద్దని

ఎలాంటి విషయాలు లీక్ చేయవద్దని

సాధారణంగా ఎలాంటి సినిమా చేసినా కూడా జక్కన్న వీలైనంత వరకు కొన్ని విషయలను గోప్యంగా ఉంచుతారు. ఎవరైనా లీక్ చేసే ప్రయత్నం చేస్తారేమో అని ఇంటర్వ్యూ ఇచ్చే ముందు తనకు చెప్పి వెళ్లాలనే కండిషన్ కూడా పెడతారు. సినిమా గురించి ఎలాంటి విషయాలు లీక్ చేయవద్దని చాలా క్లారిటీగా వివరణ ఇస్తారు.

లీక్ చేసిన రైటర్

లీక్ చేసిన రైటర్

అయితే అప్పుడప్పుడు కొంతమంది సినిమా గురించి మాట్లాడే క్రమంలో ఆసక్తికరమైన విషయాలని బయటపెడుతున్నారు. ఇక ఫైనల్ గా మరొకసారి సినిమా కథ రచయిత విజయేంద్రప్రసాద్ కూడా పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పడం మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఎమోషనల్ ఫైట్ కన్నీళ్లు పెట్టుకుంటారని గత ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు.

ఎమోషనల్ ఫైట్

ఎమోషనల్ ఫైట్

ఇక రీసెంట్ గా ఆలీతో సరదాగా షోలో కూడా మరొకసారి విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చిన విధానం అభిమానుల్లో అంచనాల డోస్ ను పెంచింది. ఆయన చెప్పినాధాన్ని బట్టి రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య ఎమోషనల్ ఫైట్ ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

 పరిస్థితులు ప్రభావం వల్ల

పరిస్థితులు ప్రభావం వల్ల

హీరో విలన్ ను కొడితే ఇంకా కొట్టాలి అనుకుంటాం. కానీ మంచి కోసం ఇద్దరు మంచి వాళ్ళు కొట్టుకుంటే తట్టుకోలేము. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే ఏ తల్లి కూడా ఓర్చుకోలేదు. కొట్టుకోవద్దురా అని బాధపడుతుంది. ఇక ఇద్దరు సూపర్ స్టార్స్ పరిస్థితులు ప్రభావం వల్ల అలా కొట్టుకుంటూ ఉంటే నేనే ఎమోషనల్ అయ్యాను...అని విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు

 ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో

ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో

విజయేంద్ర ప్రసాద్ చెప్పినధాన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్ హైలెట్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది. సినిమా రైటర్ ఆ రేంజ్ లో ఎమోషనల్ అయ్యారు అంటే ఇక హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆ ఫైట్ చూసి ఎలా తట్టుకుంటారో అనే ఆలోచన రాకుండా ఉండదు. రాజమౌళి క్రియేట్ చేస్తున్న ఈ వండర్ తప్పకుండా ఎదో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మరోసారి ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X