రాజమౌళి పిండేస్తాడని ముందే భయపెట్టారు.. ఆ తరువాత క్లారిటీ వచ్చేసింది: RRR రైటర్
టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకవైపు మెగా అభిమానులు మరోవైపు నందమూరి అభిమానులు. ఈ రెండు వర్గాలను ఇప్పుడు ఏకం చేసేలా వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. అయితే సినిమాకు డైలాగ్స్ అందించిన రైటర్ సాయి మాధవ్ బుర్ర రాజమౌళితో వర్క్ చేసిన అనుభవాన్ని పంచుకున్నారు.
జాన్వీ కపూర్ సెక్సీ అండ్ బ్యూటీఫుల్ ఫోటోషూట్..

అంతకుమించి అనేలా..
బాహుబలి లాంటి సినిమాతో టాలీవుడ్ బలాన్ని ప్రపంచానికి ఛాటి చెప్పిన రాజమౌళి దాని తరువాత అంతకుమించి అనేలా చేస్తున్న చిత్రం RRR. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు బిగ్ స్టార్స్ నటిస్తున్న సినిమాను ఆయన ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది అందరిలో ఒక ఆసక్తిని రేపుతోంది. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అసలైన మల్టీస్టారర్ సినిమా
అయితే సినిమాకు డైలాగ్స్ అందించిన సాయి మాధవ్ బుర్ర ఒక ఇంటర్వ్యూలో రాజమౌళితో చేసిన చేసిన అనుభవం గురించి షేర్ చేసుకున్నారు. రామారావు గారు నాగేశ్వరరావు గారు అలాగే కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ మల్టీస్టారర్ సినిమాలు చేసిన తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో మరో సినిమా రాలేదు. ఇక ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న అసలైన మల్టీస్టారర్ సినిమా RRR అని సాయి మాధవ్ తెలిపారు.

రాజమౌళి గురించి చెప్పి భయపెట్టారు
సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి రాజమౌళితో వర్క్ చేయాలని ఉంటుంది. అయితే రాజమౌళితో వర్క్ చేయడం కష్టమని చాలా మంది నాతో చెప్పారు. పిండేస్తారు ఆయనతో వర్క్ చేయడం మామూలు విషయం కాదని భయపెట్టారు కూడా.. అని ఈ టాప్ రైటర్ వివరణ ఇచ్చారు.

చాలా క్లారిటీగా ఉంటారు.
అయితే నేను రాజమౌళితో వర్క్ చేసిన తరువాత చాలా క్లారిటీ వచ్చింది. ఆయన కథ సెట్ చేసుకున్నప్పుడే చాలా క్లారిటీగా ఉంటారు. మైండ్ లోనే సినిమా మొత్తం ప్రింట్ అయ్యి ఉంటుంది. ఇక డైలాగ్స్ రాసేటప్పుడు నాకు ఎలాంటి కష్టం అనిపించలేదు. ఇద్దరి హీరోలను సమానంగా చూపించబోతున్నారు.. అని తెలిపారు.

టెన్షన్ లేకుండా
సినిమాకు నా పరంగా వర్క్ అయిపోయింది. ఏదైనా చెంజెస్ ఉంటేనే అప్పుడప్పుడు నన్ను పిలిచి మాట్లాడేవారు. కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఏ విషయమైనా కూడా చాలా క్లియర్ గా ఉంటారు. చాలా క్లారిటీగా పని చేయించుకుంటారు. నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు వర్క్ చేశాను. కానీ ఈ సినిమాకు మాత్రమే టెన్షన్ లేకుండా వర్క్ చేశాను.. అంటూ సాయి మాధవ్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











