ఆ అనుమానాలకు రాజమౌళి సరైన సమాధానం ఇస్తాడు: RRR రైటర్
మెగా అభిమానులు, నందమూరి ఆభిమానులు అనే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. బాహుబలి అనంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అన్ని భాషల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరణ్ అల్లురి సీతారామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
అయితే ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై అభిమానుల అంచానాలకు తగ్గట్టు సమానంగా చూపించాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒక హీరో రేంజ్ పెరిగి మరొక హీరో రేంజ్ తగ్గిస్తే.. అభిమానులు ఏ మాత్రం తట్టుకోలేరు. అందుకే అనేక సందేహాలు ఈ సినిమాపై ఉన్నాయి. ఇక చాలా కాలం తరువాత ఈ విషయంపై రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.

ఆయన RRR కథను అందించిన విషయం తెలిసిందే. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాపై ఒక స్పెషల్ కామెంట్ చేశారు. RRRపై చాలా మందిలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అయితే వాటన్నిటికి సినిమాతోనే రాజమౌళి సరైన సమాధానం చెబుతారని విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అదే విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలు కూడా చాలా సమానంగా ఉంటాయని రాజమౌళి తప్పకుండా న్యాయం చేస్తాడని తెలియజేశారు. మరి ఆయన మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఒక రేంజ్ లో కిక్కిచ్చింది. మరి అదే స్థాయిలో తారక్ కోమురమ్ భీమ్ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











