రాజమౌళి తండ్రి సంచలన వ్యాఖ్యలు: RRR మూవీలో హీరో ఒక్కడేనా? ఏ రైటర్ కూడా ఇలా చెప్పరుగా!

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలిసేలా చేసిన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. 'బాహుబలి' సిరీస్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరిగి రాసిన ఆయన.. రెండేళ్ల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాతో వచ్చి మరోసారి సెన్సేషన్ అయ్యారు.

టాలీవుడ్‌లోనే టాప్ హీరోల కలయికలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో ఎన్నో ఘనతలను, రికార్డులను సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలోని హీరోలపై చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే....

RRR Writer Vijayendra Prasad Sensational Comments On Jr NTR and Ram Charan Roles

స్టార్ హీరోలతో మల్టీస్టారర్: టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు. ఇక, ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు.

RRR Writer Vijayendra Prasad Sensational Comments On Jr NTR and Ram Charan Roles

భారీ వసూళ్లు.. వరల్డ్ క్రేజ్: RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా చాలా రోజుల పాటు థియేటర్లలో భారీ ప్రభావాన్ని చూపించి రూ. 1300 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా దక్కాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.

RRR Writer Vijayendra Prasad Sensational Comments On Jr NTR and Ram Charan Roles

ఆస్కార్ అవార్డ్.. హీరోలూ: ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా.. వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అలాగే ఎన్నో కేటగిరీల్లో సత్తా చాటి ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ వంటి జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది. అదే సమయంలో ఈ సినిమాలోని హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు.

RRR Writer Vijayendra Prasad Sensational Comments On Jr NTR and Ram Charan Roles

రామ్ చరణ్ రోల్ ఇష్టం: RRRను ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించారు. కానీ, ఇందులో మెగా హీరోకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు చర్చలు జరిగాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా తనకు రామ్ చరణ్ పాత్ర ఇష్టం అని ఆ మధ్య చెప్పారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి కామెంట్‌నే చేసి కొత్త చర్చకు తెరలేపారు.

సినిమా చూశాక మారింది: తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ 'ఒక పాత్రను తక్కువ చేయడం.. ఒక పాత్రను ఎక్కువ చేయడం కాదు. కథ రాసేటప్పుడు రెండు పాత్రలు ఒకేలా అనిపించాయి. ఒకేలా అనుకునే రాశాం. కానీ, సినిమా చూసిన తర్వాత వేరేగా ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ పాత్రలో చాలో వేరియేషన్స్ ఉంటాయి. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది' అని చెప్పారు.

RRR Writer Vijayendra Prasad Sensational Comments On Jr NTR and Ram Charan Roles

సపోర్టింగ్‌గా ఎన్టీఆర్ రోల్: విజయేంద్ర ప్రసాద్ కంటిన్యూ చేస్తూ.. 'ఎన్టీఆర్ గొప్ప నటుడు. అతడి ఎలాంటి రోల్ ఇచ్చినా తినేస్తాడు. అయితే, RRR మూవీలో పోషించిన పాత్ర చేయడం చాలా కష్టం. ఈ రోల్ కథను ముందుకు తీసుకెళ్లడంలో సపోర్టింగ్‌గా ఉంటుంది. రామ్ చరణ్ పాత్రను రాముడిలా చూపించలేదు. రామరాజు లాగానే చూపించాం. కానీ, అది శ్రీరాముడిలా వచ్చింది' అని తెలిపారు.

RRR Writer Vijayendra Prasad Sensational Comments On Jr NTR and Ram Charan Roles

ఆ ప్రభావం వల్లే చరణ్: ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ 'చరణ్‌ను రామరాజులా చూపిస్తే నార్త్ వాళ్లు నిజంగానే రాముడు వచ్చాడని అనుకున్నారు. మేము ఆ ఉద్దేశంతో తీయకపోయినా మాకు అది కలిసి వచ్చింది. నా మీద కూడా ఆ రాముడి గెటప్ ప్రభావం చూపించిందేమో.. అందుకే నాకు ఆ పాత్ర ఎక్కువగా నచ్చింది' అన్నారు. మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను నిరాశ పరిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X