‘సరైనోడు’ స్పెషల్ సాంగు ఖర్చు రూ. కోటిన్నర, కారణం ఇదే!

By Bojja Kumar

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరైనోడు' చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగు కోసం రూ. కోటిన్నర విలువ చేసే సెట్ వేసారు.

‘అల్లు అర్జున్, కేథరిన్ లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీరిస్తున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల స్థలంలో రూ. కోటిన్నర ఖర్చు పెట్టి సెట్ వేసారు. ఈ సాంగులో దాదాపు 300 మంది డాన్సర్లు బ్యాగ్రౌండ్లో స్టెప్పులేస్తున్నారు. మరో మూడు రోజుల్లో సాంగ్ చిత్రీకరణ పూర్తి కాబోతోంది' అని యూనిట్ సభ్యులు తెలిపారు.

Rs.1.5 cr set for 'Sarrainodu' special song

పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రఫీ ద్వయం బాస్కో-కాసెర్ ఆధ్వర్యంలో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సాంగ్ చిత్రీకరణలో అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కార్లను కూడుతున్నారు. ఇందుకోసం వాటిని ప్రత్యేకంగా రెంటుకు తెప్పించారు. సాంగ్ చాలా బాగా వస్తోందని, సినిమాలో ఇది హైలెట్ అవుతుందని అంటున్నారు.

బన్నీ సొంత బేనర్లో... ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X