భలే బేరం: కోటిన్నర ఇస్తానన్నా కుదరదంటున్నాడు
ముంబై: ఒక్కోసారి అతి సాధారణమైన వస్తువులు కూడా కాల,మాన పరిస్ధితులను బట్టి విలువ అనూహ్యంగా పెరిగిపోతుంది. ఇప్పుడు అలాంటిదే 'పీకే' చిత్రంలోని తొలి పోస్టర్ లో చూపిన ట్రాన్సిస్టర్ కు పట్టింది. దీనికి కోటిన్నర రేటు పలుకుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. అయితే అమీర్ ఖాన్ ఈ ట్రాన్సిస్టర్ ఇవ్వటానికి ఇష్టపడటం లేదు అంటున్నారు.
వివరాల్లోకి వెళ్లితే...రైలుపట్టాలపై నగ్నంగా ట్రాన్సిస్టర్ అడ్డుపెట్టుకొని నిలుచున్న ఆమీర్‌ఖాన్... 'పీకే' చిత్రంలోని తొలి పోస్టర్ ఇది. దీంతోనే పీకేపై అంచనాలు ఓ స్థాయిలో మొదలయ్యాయి. తర్వాత ఒకటొకటిగా పోస్టర్‌లు, ప్రచార చిత్రాలు, పాటలు విడుదలయ్యాయి. వీటన్నింటిలోనూ ఆమీర్‌ఖాన్‌తోపాటు కనిపించే వస్తువు ట్రాన్సిస్టర్. ఇది ప్రేక్షకుల దృష్టినే కాదు చిత్రబృందాన్ని ఎంతగానో ఆకర్షించింది. చాలామంది దీనిపై మనసుపడ్డారు.
చిత్ర హీరోయిన్ అనుష్కశర్మ అయితే ఏకంగా ఓ అడుగు ముందుకేసి ఆ ట్రాన్సిస్టర్ నాకు కావాలంటూ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, ఆమీర్‌ఖాన్‌లను అడిగేసింది. 'నువ్వే కాదు మేమూ మనసుపడ్డాం ఆ ట్రాన్సిస్టర్‌పై' అని చెప్పేశారు. తాజాగా దీనిపై ఆన్‌లైన్‌లో వస్తువులను వేలం వేసే ఓ సంస్థ కన్నుపడింది. ఏకంగా రూ.1.5కోట్లు ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకొచ్చిందని సమాచారం.

మహాఅయితే రూ.200-300 మధ్యలో ఉండే ఈ ట్రాన్సిస్టర్‌కు ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ వచ్చినా ఆమీర్‌ఖాన్ ససేమీరా అన్నాడట. 'ఈ ట్రాన్సిస్టర్ నాకెంతో ప్రియమైంది. దీన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు' అని ఆమీర్‌ఖాన్ చెప్పాడట. ''ట్రాన్సిస్టర్ కోసం భారీ మొత్తం ఇవ్వడానికి ముందుకొచ్చిన మాట వాస్తవమే''అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.
'పీకే'లో అనుష్క శర్మ నగ్నంగా కనిపిస్తుంది అనే వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని తేలిపోయింది. దీంతో చాలామంది నిరాశ చెందుంటారు. అందుకేనేమో వాళ్లను ఈ విధంగా సంతృప్తిపరిచింది అనుష్క శర్మ. ఇటీవల ముంబయిలో 'పీకే' టీజర్ విడుదలైంది. కార్యక్రమంలో అమీర్‌ఖాన్ వివిధ గెటప్పుల్లో ఉన్న పీకే పోస్టరు కటౌట్లు ఉంచారు. అమీర్‌ఖాన్ నగ్నంగా రేడియో అడ్డుపెట్టుకొని ఉన్న పోస్టర్‌లో అనుష్క సందడి చేసింది. మిగిలిన రెండు పోస్టర్లలో సరదాగా తలలు ఉంచి ఫోటోలకు ఫోజులిచ్చారు రాజ్‌కుమార్ హిరానీ, విధువినోద్ చోప్రా.
అలాగే... అమీర్‌ఖాన్ రోజుకు వంద కిళ్లీలు తిన్నాడు. ఇది నిజం. అమీర్‌కు పాన్ వేసుకొనే అలవాటు ఈ స్థాయిలో ఉందా అనుకోవద్దు. 'పీకే' కోసం ఓ వంద కిళ్లీలు పరాపరా నమిలేవాడు. 'పీకే'లో అమీర్‌ఖాన్ తొమ్మిది గెటప్పులో కనిపిస్తాడని సమాచారం. ఇందులో ఓ పాత్రలో ఆయన పదే పదే కిళ్లీ నములుతుంటాడు. ఆ పాత్రకు న్యాయం చేయాలని వంద కిళ్లీలకు పైగానే అమీర్ తినాల్సివచ్చేది.
''ఎప్పుడో ఒకటీ అరా తప్పితే పాన్ అలవాటు నాకు లేదు. ఈ సినిమా కోసం రోజుకు ఏకంగా 100పైనే తిన్నాను. ప్రత్యేకంగా ఓ పాన్‌వాలాను పెట్టుకున్నాం''అని చెప్పాడు అమీర్.
పీకే గురించి మాట్లాడుతూ ''ఓ మంచి కథాంశమిది. చక్కటి సందేశం ఉంటుంది. అదేంటో ఇప్పుడే చెబితే కథ తెలిసిపోతుంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో సవాలుతో కూడిన పాత్రలు చాలా పోషించాను. ఇందులోని పాత్ర వాటన్నింటికంటే కష్టమైంది''అని చెప్పారు. చిత్రంలో అమీర్‌ఖాన్ ఎక్కువ భాగం కళ్లు ఆర్పకుండానే చూస్తూ ఉన్నారట.. ఇది మీకు ఎలా సాధ్యమైంది అనడిగితే ''చాలా సులువు. అనుష్కశర్మ కళ్లలోకి చూస్తూ ఉండేవాణ్ని''అని చెప్పాడు అమీర్‌ఖాన్.
అలాగే అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్ ఇదే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











