ఏంటీ..తారకరత్నకు అంత పెరిగిందా?

By Staff

Tarakaratna
నవ్విన నాపచేనే పండిందినన్నట్లు తారకరత్న అదృష్టం మళ్ళీ తిరగబడేటట్లు కనపడుతోంది. తెలుగుదేశం ప్రచారం కోసం చేసిన ర్యాలీలు బాగానే సక్సెస్ అయ్యాయి. మరో ప్రక్క బాబయ్య బాలయ్యే సిఎం కావాలనటం పార్టీ వర్గాల్లో కలవరం కూడా రేపింది. అయితే తెలుగు దేశం ప్రచారంలోకి రావాలని చేసే ప్రచారం పార్టీ కన్నా అతనికి ఎక్కువ లాభించింది. అతను ఎక్కడికెళ్ళినా బాగానే ఆదరించటం సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. దాంతో అతని సినిమాలకు మళ్ళీ మెల్లిగా డిమాండు పెర్గుతోంది. మామ చంద్రబాబు సైతం ఇతని మాటలను ఆలకించి అతని నిర్ణయాలకు సైతం విలవఇవ్వటం అతనికి ఆనందాన్నిచ్చే అంశం.

అలాగే అతని ఆగిపోయిన వెంకటాద్రి సినిమా ఇప్పుడు దాదాపు కోటి రూపాయలు దాకా శాటిలైట్ డిమాండ్ వచ్చిందని సమాచారం. ఇన్నాళ్ళూ బయ్యర్లు లేక ఆగిపోయిన సినిమాని డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. దాంతో అతనితో సినిమా అంటే కోరి కొరివితో తల గోక్కున్నట్లే అనుకున్న వారంతా మళ్ళీ అతని దగ్గరకు చేరుతున్నారు. ఇక ఇదే ఊపులో ముక్కంటి సినిమాని కూడా పూర్తి చేసి రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. అంతేగాక సామాజిక వర్గంలోని కొందరు నిర్మాతలు మళ్ళి తారకరత్న హీరోగా సినిమా ప్రపోజల్స్ తో ముందుకు వస్తున్నారని సమాచారం. ఈ స్ధితిలో అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ఎన్నికలు అయ్యే దాకా ఎటువంటి కమిట్ మెంట్స్ ఇవ్వనని తెగేసి చెప్తున్నాడుని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X