Pushpa 2: పుష్ప 2 ప్రమోషన్స్‌కు అన్ని కోట్లా? పుష్ప రాజ్ రేంజ్ మామూలుగా లేదుగా!

Pushpa 2 promotions: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూవీ పుష్ప 2 ( Pushpa: The Rule ). పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ మూవీ కోసం వర్డల్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్నది. పుష్ప 1 ఎలాంటి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి స్వీకెల్ గా వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ తరుణంలో ప్రమోషన్స్ తో మరింత హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాలని భావిస్తున్నారట. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే?

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే పుష్ప 1 మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2 . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఓ సాధారణ కూలీ అయిన పుష్పరాజ్‌, ఎర్రచందనం సిండికేట్‌ ను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడు. ఈ తరుణంలో ఎదురైన ఇబ్బందులను ఎలా అధిగమిస్తాడనేది 'పుష్ప ది రూల్‌' చూడొచ్చని మేకర్స్ గతంలో వెల్లడించారు. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Rs 150 crores will be spent for Allu Arjun Pushpa 2 movie promotions

ఇదెలా ఉంటే.. పుష్ప-2 సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే? పుష్ప 2 మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2 మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా వర్డల్ వైడ్ గా విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ ప్రమోషన్స్ పై మూవీ టీం ఫోకస్ పెట్టింది. పుష్ప 1 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసింది. ఆ మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కూడా అంతకుమించి అనేలా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందని మూవీ మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి.. దాదాపు 150 కోట్ల రూపాయలను వెచ్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు,స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని భావిస్తుంది. అలాగే దేశంలోని ప్రధాన పట్టణాలలో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యేలా.. భారీ ఎత్తున ఓర్డింగ్స్ , కటౌట్స్ ను ఏర్పాటు చేయాలని, ఈ తరుణంలో పలు బ్రాండ్లతో కలిసి ప్రమోషన్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా ట్రైలర్ నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అది కూడా .. పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న ఐకానిక్ గాంధీ మైదాన్‌లో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ నిర్మించనున్నరట. ఈ కార్యక్రమానికి ఇటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రేటీలను కూడా పిలువబోతున్నట్టు తెలుస్తోంది. ఈవెంట్ కు కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Rs 150 crores will be spent for Allu Arjun Pushpa 2 movie promotions

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రధానంగా బన్నీ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేసిన పుష్పగాడి హవా కనిపిస్తుంది. దాదాపు 20 రోజుల ముందే ఇలా ఉంటే.. రిలీజ్ సమయం వరకు పుష్ప హవా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పనవసరం లేదు. ఏది ఏమైనా పుష్ప 2 సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుందని, గతంలో నీ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను తిరగా రాయబోతుందని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X