రాజశేఖర్ ‘కల్కి’ కోసం 2 కోట్లతో సెట్.. 1980 నాటి తెలంగాణ..
Recommended Video

Very Expensive Set For Rajasekhar's Kalki Movie
పీఎస్‌వీ గరుడవేగ బ్లాక్‌బస్టర్‌తో యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో కల్కి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కల్కి చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్రం కోసం భారీ సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తున్నది.

సినిమాలో కీలకంగా మారడంతో ఈ సెట్‌ను 2 కోట్లతో రూపొందించినట్టు తెలిసింది. 1980 దశకంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌ను ప్రతిబింబించేలా వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు సమాచారం.
తెలంగాణ ప్రాంతంలోనే చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది.


Click it and Unblock the Notifications











