బన్నీ ఎంట్రీ కోసం 20 లక్షల ఖర్చా.. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పరిగెత్తుకుని వెళతారు, వేదికపై దుమారమే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య. బన్నీ నటిస్తున్న తొలి దేశభక్తి చిత్రం ఇదే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పవర్ ఫుల్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. మిలటరీ అధికారిగా బన్నీ గెటప్ ఊరమాస్ అనిపించేలా ఉంది. ఆర్మీ మాన్ గా బన్నీ చేసే పోరాటాలు కళ్ళు చెదిరేలా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికె విడుదల చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ అదిరిపోన సంగతి తెలిసిందే.
Recommended Video

మే 4 న భారీ ఎత్త్తున నాపేరు సూర్య చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలని షురూ చేసింది. ఏప్రిల్ 29 న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సంబందించిన విశేషాలు తెలిస్తే అభిమానులు ఈవెంట్ కు ఎగబడడం ఖాయం. ఆసక్తి రేపుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్ విశేషాలు ఇలా ఉన్నాయి.

అభిమానుల కోసం వెరైటీగా
నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఈవెంట్ అన్ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ లా కాకుండా వెరైటీ నిర్వహించనున్నారు. అభిమానులని అలరించేందుకు నేరుగా బన్నీనే రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. డాన్స్ గ్రూప్ పెర్ఫామెన్స్ తక్కువగ్గా ఉండి అభిమానులని అలరించేందుకు కొత్తగా ప్లాన్ చేస్తున్నారు.

బన్నీ ఎంట్రీ కోసమే 20 లక్షలు
ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎంట్రీ కోసమే దాదాపు 20 లక్షలు నిర్మాతలు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంట్రీ ఇచ్చిన వెంటనే సినిమా నేపథ్యాన్ని వివరించేలా, దేశభక్తి ఉట్టిపడేలా అల్లు అర్జున్ జిమ్నాస్టిక్స్ పెర్ఫామ్ చేయబోతున్నట్లు సమాచారం.

ముఖ్యఅతిధిగా మెగా పవర్ స్టార్
బన్నీ చేయబోయి జిమ్నాస్టిక్ కేవలం శాంపిల్ మాత్రమే అన్ని అలాంటి విన్యాసాలు ఈ వేడుకలో చాలా ఉంటాయని అంటున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడు.

అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా
అజ్ఞాతవాసి ఫేమ్ అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. వీరి మధ్య సాగె లవ్ ట్రాక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనునట్లు తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











