»   » మహేష్ ‘బ్రహ్మోత్సవం’: పాట కోసం రూ.3.5 కోట్లు ఖర్చు

మహేష్ ‘బ్రహ్మోత్సవం’: పాట కోసం రూ.3.5 కోట్లు ఖర్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ సాంగు కోసం ఏకంగా రూ. 3.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

భారీగా ఖర్చు పెట్టి తీస్తున్న ఈ సాంగు మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సాంగును చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబుతో పాటు ప్రణీత, జయసుధ, సాయాజీ షిండే, తనికెళ్ల భరణి, నరేష్, కృష్ణ భగవాన్ తదితరులు ఈ సాంగులో కనిపించనున్నారు.


Rs.3.5 Cr 'Sangeet' Number For Mahesh Babu's Brahmotsavam

ఈ సాంగు చిత్రీకరణకు సెట్టింగ్ష్, ఇతర ఖర్చులు కలిపి దాదాపు రూ. 3.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒక సాంగు కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో చాలా అరుదు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల సినిమాల్లోనే ఇలాంటి సాధ్యం.


యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన చాందినీ చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి సాంగులో నటించే అవకాశం దక్కించుకుంది. మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో సమంత, కాజల్ నటిస్తున్నారు. అక్టోబర్ 5 నుండి ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

English summary
The makers of superstar Mahesh Babu's Brahmotsavam, which is currently on the floors, are said to have spent a whopping Rs.3.5 crore on a song for the film.
Please Wait while comments are loading...