రాజీపడే ప్రసక్తే లేదు: ప్రభాస్ నెక్ట్స్ మూవీ కోసం రూ. 30 కోట్లతో భారీ సెట్!
Recommended Video
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ ప్రాజెక్టులు చేయడంపైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన సుజీత్ దర్శకత్వంలో బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ 'సాహో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
'సాహో' మూవీతో పాటు ప్రభాస్ 'జిల్' మూవీ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1970 కాలం నాటి కథతో సాగుతుందట. సినిమా కథ ప్రకారం యూరఫ్‌లోని కొన్ని రియలిస్టిక్ లొకేషన్లలో షూటింగ్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

రూ. 30 కోట్లతో భారీ సెట్
అయితే సినిమా నటీనటులతో యూరఫ్ తిరగడం చాలా ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో.... కొంతవరకు షూటింగ్ ఇక్కడే మేనేజ్ చేసేందుకు హైదరాబాద్ శివారులో రూ. 30 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.

రాజీ పడే ప్రసక్తే లేదు
సాహో మూవీ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కూడా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల బడ్జెట్ అంచనాలతో ప్రభాస్ రేంజికి తగిన విధంగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీ చిత్రం అదించడానికే ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు.

జాన్
యూవి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రానికి ‘జాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రభాస్ రేంజి మారిపోయింది
బాహుబలి, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజి ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రం ప్యాన్ ఇండియా వైడ్ సంచలన విజయం అందుకోవడంతో యంగ్ రెబల్ స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ ఓ విషయం గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇకపై చేసే సినిమాల విషయంలో క్వాలిటీ అంశంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే తన సినిమాల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











