‘బాహుబలి’ నిర్మాతలకు మరో 4 కోట్లు బోనస్
హైదరాబాద్: బాహుబలి మూవీ నిర్మాతలకు లాభాల పంటపండిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. తాజాగా చిత్ర నిర్మాతలకు ఓవర్సీస్ ద్వారా మరో 4 కోట్లు అదనపు లాభం వచ్చింది. ఓవర్సీస్ అగ్రిమెంటులో భాగంగానే ఈ మొత్తం దక్కినట్లు తెలుస్తోంది.
బాహుబలి యూఎస్ఏ, కెనడా థియేట్రికల్ రైట్స్ ‘బ్లూస్కై' సినిమా వారు సొంతం చేసుకున్నారు. మొత్తం రూ. 9 కోట్లకు ఈ చిత్రం హక్కులు సొంతం చేసుకున్నారు. ఇక్కడ ఈ చిత్రం $6,997,636(రూ. 46 కోట్లు) గ్రాస్ వసూలు చేసింది. అగ్రిమెంటు ప్రకారం లాభాల్లో వాటా రూపంలో నిర్మాతలకు రూ. 4 కోట్లు దక్కాయి.

‘బాహుబలి' తర్వాత యూఎస్ఏ మార్రెట్లో ‘శ్రీమంతుడు', ‘భలే భలే మగాడివోయ్' చిత్రాలు బాగా రన్ అవుతున్నాయి. ‘శ్రీమంతుడు' చిత్రం $2,863,784 వసూలు చేసి బిజినెస్ ఎండింగ్ స్టేజీలో ఉంది. త్వరలోనే 3 మిలియన్ మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం ఓపెనింగ్ వీకెండ్ $700,000 వసూలు చేసింది. నాని కెరీర్లోనే ది బెస్ట్ గా ‘భలే భలే మగాడివోయ్' చిత్రం నిలిచింది. భలే భలే మగాడివోయ్ ఓవరాల్ బిజినెస్ 2 మిలియన్ డాలర్ల వరకు అవుతుందని అంచనా.


Click it and Unblock the Notifications











