'దూకుడు'కి చుట్టుకున్న వ్యాట్ పోటు
ఇక టాలీవుడ్ తమ ప్రింట్ల సంఖ్యను పెంచేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి వచ్చింది.మేం వెయ్యి ప్రింట్లతో విడుదల చేస్తున్నాం...లక్ష ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకోవటానికి వీలులేదు.ఎందుకంటే వ్యాట్ తో కమర్షియల్ టాక్స్ డిపార్టమెంట్ ఇప్పుడు రెడీగా ఉంది.వారి కన్ను ఇప్పుడు తెలుగు సినిమాలపై పడింది.వారు నాలుగు కోట్ల రూపాయలు వ్యాట్ పన్నును దూకుడు చిత్రానికి వేసినట్లు సమాచారం.దూకుడు సినిమాని వెయ్యి ప్రింట్లకు పైగానే విడుదల చేసామంటూ నిర్మాతలు ప్రకటించారు.అది బేస్ చేసుకునే వారు పన్నును వడ్డించారు.వారు వెంటనే తమ స్టాఫ్ ని రంగంలోకి దింపి ల్యాబ్ లో ఎన్ని ప్రింట్స్ డెలవరి అయ్యాయో లెక్కలు తీయించింది.అలాగే ఊసరవెల్లికి కూడా ఇదే పరిస్దితి వచ్చింది.అంతకుముందు కొమురం పులి చిత్రాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారు.ఈ విషయమై కమర్షియల్ టాక్స్ డిపార్టమెంట్ డిప్యూటి కమీషనర్ ఉషారాణి మాట్లాడుతూ..మేము నిర్మాతలకు ఈ విషయమై నోటీసులు ఇష్యూ చేస్తున్నాం.వారు తాము డిస్ట్రిబ్యూటర్ కి పంపిణి చేసిన ప్రింట్ల మీద వెంటనే టాక్స్ కట్టాలని చెప్తున్నాం అన్నారు.ఇక వ్యాట్ రూల్స్ ప్రకారం ముప్పై ఆరు ప్రింట్ల వరకూ పదివేలు ప్రింట్ కు టాక్స్ చెల్లించాలి.36-100 ప్రింట్లు అయితే ఇరవై వేల వరకూ టాక్స్ కట్టాలి.101-150 ప్రింట్లు అయితే ముప్పై వేలు,ఆ పైన వేసే ప్రతీ ప్రింటుకు నలబై వేలు చెల్లించాలి.


Click it and Unblock the Notifications











