రూ. 5లక్షల విరాళం స్వీకరించిన పరుచూరి
హవీష్ హీరోగా ఓంకార్ దర్శకత్వంలో 'జీనియస్' చిత్రాన్ని నిర్మిస్తోన్న 'రామదూత క్రియేషన్స్' సంస్థ రూ. 5 లక్షల విరాళాన్ని పరుచూరి రఘుబాబు నాటక పరిషత్ కు అందజేసింది. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో హవీష్ తండ్రి, విజయవాడకు చెందిన కె.ఎల్.యూనివర్శిటీ ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్కను పరుచూరి రఘుబాబు నాటక పరిషత్ మేనేజింగ్ ట్రస్టీ పరుచూరి వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 'జీనియస్' చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు ఓంకార్, రచయిత చిన్నికృష్ణ, స్క్రీన్ ప్లే రచయిత విస్సు పాల్గొన్నారు.
జీనియస్ సినిమా వివరాల్లోకి వస్తే..గతంలో ఈ సినిమా గురించి చిన్నికృష్ణ మాట్లాడుతూ "నా గత చిత్రాలన్నీ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సాగేవి. 'జీనియస్' విద్యాలయం చుట్టూ తిరుగుతుంది. అన్నాహజారే స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. ఫైర్ ఉన్న కాన్సెప్ట్. ప్రధానార్ఛకుడి కొడుకు పాత్రకు హవీష్ చక్కగా సరిపోయాడు. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి పనిచేయడం ఆనందదాయకం. ఇంత గొప్ప సినిమాను తీస్తున్న దాసరి కిరణ్‌కు వంద గుండెలున్నాయనుకోవాలి. ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు వెళ్తుంది. వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











