twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: బాహుబలి-2 ‘నైజాం’ రైట్స్.... ఎంతో తెలుసా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చి 'బాహుబలి' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన విజువల్ వండర్. విడుదల తర్వాత వసూళ్ల పరంగా ఎవరూ ఊహించని పలు రికార్డులను నెలకొల్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    <strong>బాహుబలి-2 తో ఆగదు, వర్చువల్ రియాల్టీలో కూడా: ప్రెస్ మీట్లో రాజమౌళి, ప్రభాస్, రానా (ఫోటోస్)</strong>బాహుబలి-2 తో ఆగదు, వర్చువల్ రియాల్టీలో కూడా: ప్రెస్ మీట్లో రాజమౌళి, ప్రభాస్, రానా (ఫోటోస్)

    బాహుబలి పార్ట్1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'బాహుబలి పార్ట్-2' అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడు పోతున్నాయి. తాజాగా బాహుబలి-2 నైజాం రైట్స్ ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ వారు భారీ ధరకు కొనుగోలు చేసారు.

    ఎవరూ ఊహించని రేటు

    ఎవరూ ఊహించని రేటు

    బాహుబలి-ది కన్‌క్లూజన్ నైజాం రైట్స్ ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ రూ. 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి హక్కులను దక్కించుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    అందుకే అంత పెద్ద మొత్తం

    అందుకే అంత పెద్ద మొత్తం

    నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. గతంలో మా సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలంగాణలో పంపిణీ చేసాం. బాహుబలి-2 సినిమా హక్కుల విషయంలో బాగా పోటీ ఉంది. అందుకే అంత పెద్ద మొత్తానికి దక్కించుకున్నామని, సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని, మా సంస్థకు మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నామని తెలిపారు.

    దిల్ రాజు తప్పుకున్నాడు

    దిల్ రాజు తప్పుకున్నాడు

    బాహుబలి పార్ట్-1 నైజాం హక్కులను ఇదివరకు దిల్ రాజు తీసుకోగా.. బాహుబలి-2కి నిర్మాతలు అధిక మొత్తాన్ని కోట్ చేయడంతో తప్పుకొన్నాడు. నైజాం రైట్స్ కోసం రూ. 50 కోట్ల పెట్టడం దిల్ రాజ్ రిస్క్ గా ఫీలయ్యాడని అందుకే తప్పుకున్నాడని టాక్.

    బాహుబలి పార్ట్-1 నైజాం షేర్

    బాహుబలి పార్ట్-1 నైజాం షేర్

    గతంలో దిల్ రాజు నైజాం ఏరియా బాహుబలి రైట్స్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేయగా రూ. 43 కోట్ల షేర్ వసూలు చేసింది. అందుకే ఈ సారి నిర్మాతలు బాహుబలి-2 రైట్స్ రూ. 50 కోట్లకు ఫిక్స్ చేసారు.

    ఓవర్సీస్

    ఓవర్సీస్

    ఇప్పటికే ఉత్తర అమెరికా (ఓవర్సీస్)లో ‘బాహుబలి-2' సినిమా హక్కులను రూ.45 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

    రిలీజ్ ఎప్పుడు?

    రిలీజ్ ఎప్పుడు?

    బాహుబలి-2 రిలీజ్ డేట్ ఆల్రెడీ ఖరారైంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

    ‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

    ‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్.... పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్.... పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.

    English summary
    Sunil Narang of Asian Films has acquired the distribution rights of upcoming big budget historic and war drama ‘Baahubali:The Conclusion' for the Nizam area. Reliable sources says that the amount paid for the rights is Rs 50 Crores and it is only for Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X