twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ బెడ్ రూమ్ క్రేజ్

    By Staff
    |

    Trivikram Srinivas
    త్రివిక్రమ్ బెడ్ రూమ్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. అయితే అది త్రివిక్రమ్ ఇంటిలో బెడ్ రూమ్ కాదు. మహేష్ తో రూపొందిస్తున్న వరుడు చిత్రం కోసం వేసిన బెడ్ రూమ్ సెట్ గురించే ఆ చర్చ. దాదాపు డబ్బై లక్షలుతో ఈ సెట్ వేయటమే ఈ చర్చకు కారణమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. గతంలో అతడు సినిమాకు భారీ ఖర్చుతో చర్చి సెట్ వేసి క్లైమాక్స్ తీసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఈ బెడ్ రూమ్ లో ఏం చేస్తాడన్నదే అందరికీ ఆసక్తిగా ఉంది. ఇక అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడని సమాచారం.

    ఇక చాలా లేటుగా మొదలైన ఈ చిత్రం పై నిర్మాత శింగనమల రమేష్ చాలా గుర్రుగా ఉన్నాడని చెప్తున్నారు. అందుకే మహేష్ ఆ పెట్టుబడి లో కొంత తాను భరిస్తానని హామీ ఇచ్చి ప్రారంభించాడని గుసగుసలు వినిపించాయి. ఇక ఈ చిత్రం అనంతంరం త్రివిక్రమ్..వెంకటేష్ కాంబినేషన్లో సినిమా ప్రారంభమయ్యే అవకాశముందని వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఈ వరుడు చిత్రం రిలీజ్ 2010లోనే కావటంతో ఈ సంవత్సరానికి మహేష్ సినిమా లేకుండానే గడుస్తుందంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X