twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవినీతి కుంభకోణం కేసులో శిల్పాశెట్టి ..కోర్టు నిర్దారణ

    By Srikanya
    |

    న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల అవినీతి కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులు నటి శిల్పాశెట్టికి రూ.71.73 లక్షలు చెల్లించినట్లు ఢిల్లీ కోర్టు తెలిపింది. 2008లో కామన్వెల్త్‌ యువజన క్రీడల ముగింపు వేడుకలో శిల్పాశెట్టి ఒక ప్రదర్శన చేశారు. దానికి గాను కల్మాడీ సూచనల మేరకు పీడీ ఆర్య, ఏకే మదన్‌ అనే ఇద్దరు ఆమెకు రూ.71.73 లక్షలు చెల్లించారు. వీరిద్దరూ 2010లో కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణంలో నిందితులు.

    కామన్‌వెల్త్‌ క్రీడల(సీడబ్ల్యూజీ) నిర్వహణ కమిటీ బహిష్కృత అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ, మరో 9 మందిపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమైంది. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గరిష్ఠంగా జీవితఖైదు శిక్షపడే అవకాశం గల కుట్ర, దొంగ సంతకం తదితర ఆరోపణలపై ఢిల్లీ కోర్టు సోమవారం కల్మాడీ, ఒలింపిక్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి లలిత్‌ భానోత్‌ సహా 9 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.

    నిందితులు ప్రభుత్వానికి రూ.90 కోట్లు నష్టం కలిగించారన్న ఆరోపణలపై భారత శిక్షాస్మృతిననుసరించీ, అవినీతి నిరోధక చట్టం కింద ఈ అభియోగాలు ఉన్నాయి. ఈ నెల 20 నుంచి సాక్ష్యాల నమోదుకు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి రవీంద్ర కౌర్‌ నిర్ణయించారు. సాక్షుల జాబితాను 7వ తేదీలోగా తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించారు.

    ఇవి రుజువైతే గరిష్టంగా జీవితఖైదుపడే అవకాశంఉంది. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదును ఈనెల 20న ప్రారంభిస్తామని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి రవీందర్ కౌర్ పేర్కొన్నారు. ఈనెల 7లోగా ప్రాసిక్యూషన్ తరఫు సాక్షుల జాబితాను సమర్పించాలని సీబీఐని ఆదేశించారు. అలాగే ఈ కేసు విచారణ సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పద్ధతిలో జరుగుతుందని స్పష్టంచేశారు. కల్మాడీతోపాటు క్రీడల నిర్వహణ కమిటీ మాజీ సెక్రటరీ జనరల్ లలిత్ భానోత్, కమిటీ మాజీ డెరైక్టర్ జనరల్ వి.కె.వర్మ, మాజీ జాయింట్ డెరైక్టర్ జనరల్(క్రీడలు) ఏఎస్‌వీ ప్రసాద్, హైదరాబాద్‌లోని ఏకేఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్రమోటర్ ఏకే రెడ్డి తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఏకేఆర్ కన్‌స్ట్రక్షన్స్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది.

    English summary
    
 A Delhi court dealing with a CWG related corruption case today said two of the accused had paid Rs 71.73 lakh for cinestar Shilpa Shetty's performance in the closing ceremony of 2008 CWG Youth Games at Pune 'merely to fulfill the last moment wish' of Suresh Kalmadi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X