గోపిగా అల్లరి నరేష్
రచయిత జనార్ధన మహర్షి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి గోపి అనే టైటిల్ నిర్ణయించారు. ఆర్. ఎస్. ఫిలింస్ పతాకంపై పోలిశెట్టి రాంబాబు, పల్లి కేశవరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్, ఆర్తీ ఛాబ్రియా, గౌరి ముంజల్ హీరోహీరోయిన్స్ కాగా ఒక ప్రత్యేక పాత్రలో జగపతిబాబు నటిస్తున్న సంగతి తెలిసిందే.
జూలై 27 నుంచి షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికి 70 శాతం టాకీ పార్టు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం రెండవ షెడ్యూల్ జరుపుకొంటోంది. ఈ చిత్రంలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయని రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి వివరించారు. గోపి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందని చెప్పారు.


Click it and Unblock the Notifications