twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రాగన్‌కు అమీర్‌ఖాన్ అందుకే ముద్దు.. చైనా, టర్కీతో స్నేహమా? ఆర్ఎస్ఎస్ ధ్వజం

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ధ్యజమెత్తింది. టర్కీ ప్రథమ మహిళ ఎమైన్ ఎర్డోగాన్‌తో భేటీ తర్వాత అమీర్‌పై ఆర్ఎస్ఎస్ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక పాంచజన్యలో రాసిన ఆర్టికల్‌లో భారత్ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు చేసింది. ఆర్ఎస్ఎస్ రాసిన వ్యాసంలో..

    అజయ్, అక్షయ్, కంగన జాతీయ భావంతో

    అజయ్, అక్షయ్, కంగన జాతీయ భావంతో

    బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కంగన రనౌత్ లాంటి హీరోలు, హీరోయిన్లు జాతీయ భావాన్ని రగిలించే చిత్రాలు తెరకెక్కిస్తుంటే.. అమీర్ ఖాన్ లాంటి వాళ్లు భారత్‌కు శత్రువులుగా భావించే చైనా, టర్కీ దేశాలతో స్నేహ హస్తం చాపుతున్నారు అని డ్రాగన్ కా ప్యారా ఖాన్ అనే టైటిల్‌తో రాసిన ఆర్టికల్‌లో ఆర్ఎస్ఎస్ చురకలు అంటించింది.

    టర్కీ ప్రథమ మహిళతో చేతులు కలిపి

    టర్కీ ప్రథమ మహిళతో చేతులు కలిపి

    టర్కీ ప్రథమ మహిళతో చేతులు కలిపి అమీర్ ఖాన్ భారతీయుల మనోభావాలను దెబ్బ తీశారు. ఈ విషయాన్ని ఆయన త్వరగా అర్దం చేసుకొంటే మంచింది. ఓ వైపు లౌకికవాదినని చెప్పుకొనే అమీర్ ఖాన్‌కు ఇజ్రాయెల్ ప్రధానిని కలువడానికి నిరాకరిస్తారు. కానీ టర్కీ ప్రథమ మహిళను కలువడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.

    శత్రదేశాలతో స్నేహ హస్తమా?

    శత్రదేశాలతో స్నేహ హస్తమా?

    జమ్మ, కాశ్మీర్ సమస్య విషయంలో భారత్‌కు శత్రువైన పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు తెలిపింది. అలాంటి దేశంలో అమీర్ తన సినిమాను ఎలా షూటింగ్ చేయడానికి వెళ్తారు. భారత్‌కు స్నేహంగా ఉండే దేశాలతో కాకుండా శత్రు దేశాలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించడం సబబా? అని అమీర్ ఖాన్‌ను ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది.

    Recommended Video

    Prabhas Got Prestigious Bollywood Offer
    అమీర్ అంటే చైనాకు అందుకే ముద్దు

    అమీర్ అంటే చైనాకు అందుకే ముద్దు

    అమీర్ ఖాన్‌ నటించిన దంగల్ సినిమా చైనాలో రూ.1400 కోట్లు వసూలు చేస్తే.. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మాత్రం కేవలం రూ.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దేశ భద్రతకు ముప్పు అనే హెచ్చరిక నేపథ్యంలో చైనా ఉత్పత్తి చేసే వివో మొబైల్ కంపెనీకి అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు. అలాగే చైనా సోషల్ మీడియా యాప్ వీబో‌లో అమీర్ ఖాన్‌కు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారనే విషయాన్ని తమ వ్యాసంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావించింది.

    English summary
    The Rashtriya Swayamsevak Sangh (RSS) hits out Aamir Khan over meeting Turkey's the first lady Emine Erdogan. RSS published a artcle with title of Dragans Pyara Khan. It accused Aamir of being friendly with countries that are considered India’s enemies, namely China and Turkey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X