twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    TSRTCకి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి.. లేకపోతే చట్టపరమైన చర్యలు.. సజ్జనార్ వార్నింగ్

    |

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆయన రాపిడో అనే ఒక బైక్ రైడ్ షేరింగ్ యాప్ కోసం ప్రచారం చేస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సులను చులకన చేస్తున్నట్టు కామెంట్స్ చేయడంతో పెను దుమారం రేగింది. ఇప్పటికే అల్లు అర్జున్ సహా సదరు బైక్ రైడ్ షేరింగ్ సంస్థకు ఆర్టీసీ తరపున నోటీసులు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

     ర్యాపిడో ప్ర‌క‌ట‌న‌పై అభ్యంత‌రాలు

    ర్యాపిడో ప్ర‌క‌ట‌న‌పై అభ్యంత‌రాలు

    టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున్‌ సహా, ర్యాపిడో సంస్థ‌కు లీగ‌ల్ నోటీసులు పంపిన‌ట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ న‌టించిన ర్యాపిడో ప్ర‌క‌ట‌న‌పై అభ్యంత‌రాలు వ‌చ్చాయ‌ని స‌జ్జ‌నార్ తెలిపారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆర్టీసీ బ‌స్సుల‌ను దోసెల‌తో పోల్చడంతో ప్ర‌యాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆర్టీసీ బ‌స్సుల‌ను ప్ర‌తికూలంగా చూపించ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

    కఠినంగా వ్యవహరిస్తాం

    కఠినంగా వ్యవహరిస్తాం

    తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విదంగా వ్యవరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థతో నాకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవన్న ఆయన సంస్థ ఇమేజ్ ను దెబ్బ తీసే విదంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామన్నారు. ఇక మా నోటిసులకు రిప్లై రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని సజ్జనర్ పేర్కొన్నారు.

     క్షమాపణలు చెప్పాలి

    క్షమాపణలు చెప్పాలి

    తక్షణమే అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థలు ఆర్టీసీ కి క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేసిన ఆయన సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్ లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలన్నారు. డబ్భులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని, సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని అన్నారు. తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్ లను కించపరచకూడదని ఆయన అన్నారు.

     అందరికీ అనుబంధం

    అందరికీ అనుబంధం

    ఆర్టీసీతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుంది. నా చిన్న తనం, విద్యార్థి దశ, కాలేజి జీవితం మొత్తం ఆర్టీసీ తోనే ముడిపడి ఉంది. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్ట పెంచుతాం, నష్టాల నుండి లాభాల వైపు వచ్చే విదంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. ఇక ఇలాంటి వాటి మీద ఎలాంటి ఉపేక్షణ ఉండబోదని అన్నారు. మరి ఈ విషయం మీద అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

    Recommended Video

    Singareni Colony ఘటనపై Mahesh Babu ఆగ్రహం, రాజు ఆచూకీ తెలిపితే 10 లక్షలు || Filmibeat Telugu
    పుష్పతో

    పుష్పతో

    ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఆయన సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది..మొదటి భాగం పుష్ప ది రైజ్ సినిమా డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ కెరియర్ లో మొట్టమొదటి సరిగా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    RTC MD Sajjanar crucial comments on Allu Arjun and rapido
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X