»   »  ‘రుద్రమదేవి' నగలు: గుణశేఖర్ ది తెలివైన స్ట్రాటజీ

‘రుద్రమదేవి' నగలు: గుణశేఖర్ ది తెలివైన స్ట్రాటజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం విశేషం ఒకటి యూనిట్ తెలియచేసింది. ఈ సినిమా అఫీషియల్ పేజ్ సినిమాలో 5 కోట్లు విలువజేసే బంగారు ఆభరణాలను వాడుతున్నట్లు తెలిపారు. అయితే ఇందులో గుణశేఖర్ తెలివైన స్టాటజీ అమలు చేసాడంటున్నారు.

ఓ ప్రక్క సినిమాలో రాజీ లేకుండా ఒరిజినల్ నగలు వాడినట్లు ఉంటుంది. మరో ప్రక్క ఈ నగలు మళ్లీ అమ్మకం ద్వారా తాము ఖర్చు పెట్టిన మొత్తం రికవరీ అవుతుంది. సాధారణంగా ఇలాంటి చిత్రాలకు నకిలీ ఆభరణాలు ఎంతో ఖర్చు పెట్టి తయారుచేయిస్తూంటారు. ఆ షూటింగ్ అయిపోగానే ఆ నకిలీ ఆభరణాలు విలువ లేకుండా పోతాయి. అయితే ఇప్పుడు ఈ రకంగా ఒరిజనల్ బంగారంతో చేయించిన నగలు వాడటంతో వాటి మొత్తం తిరిగి రాబట్టుకునే అవకాసం ఉందని అంటున్నారు.

Rudhrama Devi team uses jewellery worth 5Cr

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్. 'రుద్రమదేవి'కోసం భారీ సెట్...డిటేల్స్ అనుష్క ప్ భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
‘Rudhrama Devi’ team has put out a post today via its official page, stating that jewellery worth 5Crores is being uses for the movie.
Please Wait while comments are loading...