twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రుద్రమదేవి’ షూటింగ్ మొదలైంది, డీటేల్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న 'రుద్రమదేవి' షూటింగ్ ఈ రోజు(ఏప్రిల్ 27) మొదలైంది. ఒక్కడు మూవీకి చార్మినార్ సెట్ నిర్మించిన గోపన్నపల్లిలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎరీనా సెట్‌లో షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ బేనర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత దేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా 'రుద్రమదేవి'ని తెరకెక్కిస్తున్నారు.

    ఈ సందర్భంగా దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ...కోట్లాది రూపాయల వ్యయంతో పద్మశ్రీ తోట తరణి సారథ్యంలో వేసిన ఈ ఎరీనా సెట్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. ఈ సెట్‌లో 'రుద్రమదేవి' నటిస్తున్న అనుష్క, చాళుక్య వీరభద్రుడుగా రానా, గణపతిదేవుడుగా కృష్ణం రాజు, శివదేవయ్యగా ప్రకాష్ రాజ్, హరి హర దేవుడుగా సుమన్, మురారి దేవుడుగా ఆదిత్య మీనన్, నాగదేవుడుగా బాబా సెహగల్, అన్నాంబికగా నథాలియా కౌర్, ముమ్మడమ్మగా జారాషా, మదనికగా హంసానందిని, అంబదేవుడుగా జయప్రకాష్ రెడ్డి, గణపాంబగా అదితి చెంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటిస్తున్నట్లు తెలిపారు.

    భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ఈ రోజు నుంచి డిసెంబర్ వరకు జరిగే 5 భారీ షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తవుతుంది' అన్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    ‘Rudrama Devi’ 3D has started today. Rudhramadevi is historic film in 3D, simultaneously produced in Telugu and Tamil languages. The film is directed by Gunasekhar, and stars Anushka Shetty, Rana Daggubati in the lead roles, with Prakash Raj and Krishnam Raju in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X