‘రుద్రమదేవి’ 3డి ట్రైలర్ ఆవిష్కరణ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: అందాల తార అనుష్క కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రానికి సంబంధించిన 3డి ట్రైలర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రముఖుల కోసం ప్రసాద్ లాబ్స్ లో ప్రదర్శించారు. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఇలాంటి చిత్రంలో నటించాలని ఎదురు చూస్తున్నానని ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు.

‘దాదాపు పదేళ్లు కష్టపడి గుణశేఖర్ గారు ఈ కథ రెడీ చేసారు. ఈ సినిమాలో ఆయన ఫ్యాష్, హార్డ్ వర్క్ చూడొచ్చు. అల్లు అర్జున్, రానాకి స్పెషల్ థాంక్స్. వాళ్లు ఈ పాత్రలు ఒప్పుకుని చేయడం చాలా గ్రేట్' అని అనుష్క వ్యాఖ్యానించారు. గుణశేఖర్ మాట్లాడుతూ 13వ శతాబ్దానికి చెందిన ఎపిసోడ్ ఇది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్ కి ఇవ్వడానికి చాలా కష్టపడ్డాం. ఈ 3డి ట్రైలర్ ఓ మచ్చుతునక మాత్రమే. త్వరలోనే సినిమా విడుదల చేస్తున్నాం' అన్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు...

ఏప్రిల్ లో...

ఏప్రిల్ లో...

దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగు, తమిళ, మళయాల వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.

అనుష్క..

అనుష్క..

ఈ చిత్రంలో అనుష్క మరోసారి తన అందం, అభినయం, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఆమె చేసే పోరాట సన్నివేశాలు హైలెట్.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఈ చిత్రంలో అల్లు అర్జున్ చేస్తున్న గోన గన్నారెడ్డి పాత్ర సినిమాపై ప్రేక్షకులు మరింత ఆసక్తిని పెంచాయి.

రానా..

రానా..

రానాకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇందులో రానా అనుష్క భర్త పాత్ర పాత్రలో నటిస్తున్నాడు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X