బర్త్ డే గిఫ్ట్ : అనుష్క ‘రుద్రమ దేవి’ ఫస్ట్ లుక్
హైదరాబాద్ : హాట్ లేడీ అనుష్క హీరోయిన్‌గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే 'రుద్రమ దేవి' చిత్రంపై గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఎట్టకేలకు ఈ చిత్రంపై ఈ రోజు అధికారిక ప్రకటన చేసారు. రేపు(నవంబర్ 7) అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. రేపటితో అనుష్క 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది.
'రుద్రమ దేవి' చిత్రం ఒక చారిత్రక చిత్రం. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన వీరనారి రుద్రమ దేవి జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అరుంధతి చిత్రంలో యువరాణిగా అనుష్క అదరగొట్టడంతో ఈ పాత్రకు ఆమెనే కరెక్టర్ అని దర్శకుడు గుణశేఖర్ డిసైడ్ అయ్యాడు.
ఈ చిత్రం ద్వారా దర్శకుడు గుణశేఖర్ నిర్మాతగా మారుతున్నారు. తను స్థాపించిన గుణ టీంవర్స్క్ బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియాలోనే తొలి సారిగా స్టీరియో స్కోపిక్ 3డి టెక్నాలజీతో ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అనుష్క కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ. తెలుగు, తమిళంలో ఒకే సారి ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈచిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్ : తోట తరణి, కెమెరా : అజయ్ విన్సెంట్, నిర్మాత, దర్శకత్వం : గుణశేఖర్.


Click it and Unblock the Notifications












