రుద్రమదేవి: అనుష్క పుట్టినరోజు స్పెషల్ ఏటంటే..?
హైదరాబాద్: అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగినీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న అనుష్క పుట్టినరోజు నవంబర్ 7.
ఈ సందర్భంగా నవంబర్ 7న ‘రుద్రమదేవి' మేకింగ్ వీడియోను విడుదల చేయ్యబోతున్నారు. దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ..‘భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న మా రుద్రమదేవి చిత్రానికి సంబంధించి ప్రస్తుతం శరవేగంగా పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ 7 అనుష్క పుట్టినరోజు సందర్భంగా మా చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చెయ్యబోతున్నాం. గతంలో రిలీజ్ చేసిన రుద్రమదేవి ఫస్ట్ లుక్‌కి, అల్లు అర్జున్ చేస్తున్న గోన గన్నారెడ్డి ఫస్ట్‌లుక్‌కి చాలా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అనుష్క పుట్టినరోజున ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నాం' అన్నారు.

రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా, కృష్ణం రాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్య మీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితరులు నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్టూమ్ డిజైనర్: నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయి బాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











