రుద్రమదేవి అన్నపూర్ణా స్టూడియో, షూటింగ్ డీటేల్స్
హైదరాబాద్: అనుష్క మెయిన్ రోల్‌లో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'కి సంబంధించి తాజా షెడ్యూలు మార్చి 10వ తేదీ నుండి అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.
దర్శక నిర్మాత గుణశేఖర్ షూటింగ్ విశేషాలను తెలియజేస్తూ....'కాకతీయ వైభవాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దుతున్న 'రుద్రమదేవి' తాజా షెడ్యూల్ ఈ రోజు నుండి అన్నపూర్ణ స్టూడియోలెని ఏడెకరాల స్థలంలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన రాజ కొలువు(దర్బార్) సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

కాకతీయాంధ్ర మహా సామ్రాజ్జి రాణి రుద్రమదేవి దేశం నలుమూలల(నేటి తెలంగాణ, సీమాంధ్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్) ప్రాంతాల నుండి వచ్చిన సామంత రాజులతో కొలువు తీరి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు, చారిత్రాత్మక ఘట్టాలు ఈ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. మూడొందల సంవత్సరాల పాటు యావత్ దక్షిణ భారతాన్ని పాలించిన కాకతీయ చక్రవర్తుల విగ్రహాలతో ఏర్పరిచిన వీరమంటపం ఈ సెట్‌కే ఓ హైలెట్. ఈ షెడ్యూల్‌లో అనుష్క, రానా, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్య మీనన్, నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, బాబా సెహగల్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, అర్పిత్ రాంకా, వేణు మాధవ్, వెన్నెల కిషోర్, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, కృష్ణ భగవాన్, ప్రభ, అదితి చెంగప్ప, సంధ్యా జనక్, అనితానాథ్, సుబ్బరాయశర్మ, సంపత్ రాజ్, జీవా, రవిప్రకాష్, వినోద్, ప్రసన్నకుమార్, టీవీ 9 హర్ష, ఈ టీవీ ప్రభాకర్, పార్థసారథి తదితరులు పాల్గొంటున్నారు. ఏప్రిల్ 5 వరకు ఏకథాటిగా ఈ షెడ్యూల్ జరుగుతుంది' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోటతరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్ : నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటల: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామగోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











