అల్లు అర్జున్ విశ్వరూపం....శివరాత్రి రోజు చూడొచ్చు
హైదరాబాద్: గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రం ట్రైలర్ ని పిభ్రవరి 17 అంటే శివరాత్రి రోజు రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్, అనుష్క లకు చెందిన విజువల్స్ అదిరిపోతాయని, ఆ ట్రైలర్ తో ప్రమోషన్స్ ప్రారంభమయినట్లే అంటున్నారు. అయితే కేవలం అనుష్క మీద మాత్రమే ట్రైలర్ ని కట్ చేసారని కొంతమంది అంటున్నారు. ఏది నిజమో తెలియాలంటే శివరాత్రి దాకా ఆగాల్సిందే. మొదట్లో ఎన్టీఆర్ ...తాజా చిత్రం టెంపర్ తో పాటు ట్రైలర్ ని కలిపి వదులుతారు అనుకున్నారు కానీ చివరి నిముషాల్లో గుణశేఖర్ మనస్సు మార్చుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమదేవి'గా టైటిల్ పాత్ర పోషిస్తున్న అనుష్క నటిస్తున్న చిత్రం ట్రైలర్ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణశేఖర్ రూపొందిస్తున్న తొలి హిస్టారికల్ త్రీడి సినిమా ‘రుద్రమదేవి'. ప్రస్తుతం ఈచిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తుండగా...చాళుక్య వీరభద్రుడిగా రానా నటిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన అనుష్క, రానా లుక్‌లతో పాటు మేకింగ్ వీడియోలు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్ ను శివరాత్రి కానుకగా విడుదల చేయటానికి గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు.
రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా, కృష్ణం రాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్య మీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితరులు నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్టూమ్ డిజైనర్: నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయి బాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











