'రుద్రమదేవి'‌: మహాదేవుడుగా.... ఎవరంటే (ఫొటో)

By Srikanya

హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర బృందం వరుసగా పోస్టర్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరసలో తాజాగా మహదేవుడుగా విక్రమ్ జీత్ ఫొటోను రిలీజ్ చేసారు. ఆ ఫోటోను మీరు ఇక్కడ చూడవచ్చు.

Vikramjeet Virk as 'Mahadevudu' the King of Rival Kingdom of Devagiri. #Rudhramadevi #EpicDrama

Posted by Rudhramadevi on 25 July 2015

ఈ చిత్రంలో మహాదేవుని పాత్రలో విక్రమ్‌జీత్‌ నటిస్తున్నారు. ఈయన గతంలో ఎన్టీఆర్‌ బాద్‌షా, పూరీ జగన్నాథ్‌ హర్ట్‌ఎటాక్‌, సునీల్‌ భీమవరం బుల్లోడు వంటి చిత్రాలు నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రుద్రమదేవిలో మహాదేవుడి పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదల కానుంది.

అలాగే...ఈ చిత్రానికి సంభందించిన విశేషాలకు ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి ఓ యాప్ ని విడుదల చేసారు. ఆ యాప్ ఇక్కడ చూడండి..

Download #Rudhramadevi Android App here - http://bit.ly/1SIw3Nx

Posted by Rudhramadevi on 25 July 2015

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘రుద్రమదేవి' విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గుణశేఖర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నామని, తెలుగు వారు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.

భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతోందీ ఈ చిత్రం. 'రుద్రమదేవి' చిత్రంలో అనుష్క రుద్రమదేవిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పోషించారు.

చిత్రం బిజినెస్ విషయానికి వస్తే..

ఇండస్ట్రీలో ఒకప్పుడు దిల్ రాజు సినిమా హక్కులు తీసుకున్నాడంటే హిట్ గ్యారెంటీ అనే నానుడి ఉండేది. ఇప్పుడు అది మారింది. వారాహీ చలన చిత్రం బ్యానర్ నిర్మాత కొర్రిపాటి సాయి ...ఓ సినిమా ని తీసుకున్నాడంటే ఖచ్చితంగా హిట్ అంటున్నారు. దాంతో మిగతా ఏరియాలు బిజినెస్ కూడా స్పీడుగా జరిగిపోతోంది. తాజాగా ఆయన 'రుద్రమదేవి' చిత్రం కృష్ణా ఏరియా రైట్స్ తీసుకున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఆ ఏరియాకు ఆయన రెండు కోట్ల ఎనభై లక్షలు చెల్లించారని తెలుస్తోంది. అల్లు అర్జున్ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించటం, రానా, అనుష్క లు కూడా ఈ సినిమాలో ఉండటం ప్లస్ అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rudramadevi:Vikramjeet Virk as 'Mahadevudu'

దర్శకనిర్మాత మాట్లాడుతూ '' సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.

మరో ప్రక్క గుణశేఖర్ తన తాజా చిత్రం 'రుద్రమదేవి' కి కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నారు. కళ్లద్దాలు లేని త్రీడిలో తమ సినిమాని చూడెపడతాను అంటున్నారు. ఆ ఎక్సపీరియన్స్ పూర్తి డిటేల్స్ ఇక్కడ...

సాధారణంగా త్రీడి సినిమాలను చూడడానికి ప్రత్యేక కళ్లజోళ్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కళ్లజోళ్లు అవసరం లేకుండానే త్రీడీ సినిమా చూడగలిగితే అనే ఆలోచనను నిజం చేయబోతున్నారు. అలాంటి ఎక్సపీరియన్స్ నే 'రుద్రమదేవి' సినిమా ఇవ్వనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని వినియోగించారు దర్శకుడు గుణశేఖర్‌.

Rudramadevi:Vikramjeet Virk as 'Mahadevudu'

'ఎన్‌హ్యాన్స్‌డ్‌ డెప్త్‌ సొల్యూషన్‌' (ఈడీఎస్‌) అనే విధానం ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన 'యింగ్‌ గ్రూప్‌' సంస్థ ఆధ్వర్యంలో జేమ్స్‌ ఆష్‌బే, మైల్స్‌ ఆడమ్స్‌ బృందం ఈ పనులు నిర్వహిస్తోంది. 'కింగ్‌ కాంగ్‌', 'కుంగ్‌ ఫూ పాండా', 'ఇన్‌సెప్షన్‌', 'అవతార్‌' వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసింది.

గుణశేఖర్ మాట్లాడుతూ ''రుద్రమదేవి'ని టూడీ, త్రీడీ విధానాల్లో తెరకెక్కించారు. అయితే త్రీడీలో సినిమా చూసే అవకాశం అందరికీ ఉండదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు త్రీడీ కళ్లద్దాలను అందించలేని పరిస్థితి. అందుకే అందరికీ త్రీడీ అనుభూతి కలిగించాలని యింగ్‌ గ్రూప్‌ను సంప్రదించాం. వాళ్లకు త్రీడీ విధానంలో మంచి అవగాహన ఉంది. టూడీ థియేటర్లలోనూ త్రీడీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే ఈడీఎస్‌ విధానం గురించి చెప్పారు. అలా టూడీలో చిత్రీకరించిన సినిమాను ఈడీఎస్‌ ద్వారా మార్పు చేశాం'' అని వివరించారు.

ఈడీఎస్‌ విధానంలో ఫొటో డెప్త్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రతి ఫ్రేమ్‌ మీద రెండు సార్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే డెప్త్‌ పెంచే క్రమంలో రీల్‌లోని బొమ్మల రంగులు మారాయి. దాంతో మరింత శ్రద్ధ తీసుకుని ఆ తేడా కనిపించకుండా చేశారు. ఫైట్ సీన్స్ విషయంలో ఈడీఎస్‌ మార్పు కష్టమైంది. అయినా జాగ్రత్తగా కొనసాగించారు. సుమారు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమం సాగుతోంది.

Rudramadevi:Vikramjeet Virk as 'Mahadevudu'

ఈడీఎస్‌ ద్వారా మార్చిన రీల్‌లో ఇమేజ్‌ షార్ప్‌నెస్‌ కొద్దిగా తగ్గినట్టు అనిపించినా సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయి. మరోవైపు కళ్లజోళ్లు పెట్టుకుని చూసేలా కూడా కొన్ని ప్రింట్లను రూపొందిస్తున్నారు. మొత్తానికి 'రుద్రమదేవి' సినిమాను రెండు విధాలుగా చూడొచ్చన్నమాట.

మరో ప్రక్క ... ఈ చిత్రం నిర్మాతలు...బాహుబలి తరహాలోనే సీరిస్ ఆఫ్ పోస్టర్స్ ని విడుదల చేయటానికి రెడీ అవుతున్నారు. అయితే మరి బాహుబలి కు అంతర్జాతీయ స్ధాయిలో ప్రమోషన్ చేసారు. మరి ఇక్కడ కూడా చేస్తారో లేదో చూడాలి.

సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X