Rudrangi బాబోయ్.. ఆ బూతులు భరించలేం.. రుద్రంగి దర్శక, నిర్మాతలకు సెన్సార్ షాక్
జానపద కళాకారుడు, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మాతగా రసమయి బ్యానర్‌పై రూపొందిన చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమలారామన్, దివి వద్యా లాంటి తారలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమాలోని బూతు డైలాగ్స్‌పై సెన్సార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జులై 7న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ రిపోర్డు వివరాల్లోకి వెళితే..
రుద్రంగి సినిమా టీజర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలోని నటీనటులు, కంటెంట్ ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రాజెక్టును డ్రీమ్‌గా రసమయి బాలకృష్ణ తెరకెక్కించడంతో ఇంకా ఆసక్తిని పెంచింది.

రుద్రంగి అనేక ప్రత్యేకతలతో భారీగా రెస్సాన్స్ కూడగట్టుకొంటున్న సమయంలో నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకు సహకారం అందించడంతో మరింత క్రేజ్ సంతరించుకొన్నది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య రావడంతో పాటు సెన్సేషనల్‌గా స్పీచ్ ఇవ్వడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల దృష్టిపడింది.
అయితే రుద్రంగి ట్రైలర్‌లోనే తెలంగాణ యాసతో కూడిన బూతులు భారీగా ఉండటం కొంత చర్చ జరిగింది. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కావడం, పలువురు సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీలోని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఈ సినిమాలోని డైలాగ్స్ తొలగించనట్లయితే A పెద్దలకు మాత్రమే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం జరిగినట్టు సమాచారం.
రుద్రంగి సినిమాలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలు, వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ కథ గురించిన బ్యాక్ డ్రాప్‌ను డిస్‌క్లైమర్‌లో తెలియజేయాలి అని సెన్సార్ బోర్డు సభ్యులు స్పష్టం చేశారు. అలాగే కొన్ని బూతులపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను తప్పనిసరిగా తొలగించాలని ఓ పత్రాన్ని అందజేశారు.

రుద్రంగి సినిమా సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలియజేసిన డైలాగ్స్ వివరాల్లోకి వెళితే. లంజ కొడుకా, లంజముండా, లంజ లాంటి పదాలను మ్యూట్ చేయాలి. అలాగే లమ్డీ కొడుకా, లమ్డీ లాంటి పదాలను సబ్ టైటిల్స్‌ను తొలగించడమే కాకుండా డైలాగ్స్ మ్యూట్ చేయాలి సూచించారు.
ఇంకా జగపతిబాబుకు సంబంధించిన సన్నివేశాలు, బాస్టర్డ్, బోసిడి, బ్యాంచత్ లాంటి పదాలను తొలిగించాలని అధికారులు స్పష్టం చేశారు. దాదాపు పలు బూతు పదాలను తొలగించడం కానీ.. సబ్ టైటిల్స్‌ను లేపయడం, అలాగే డైలాగ్స్ వచ్చినప్పుడు సన్నివేశాల్లో మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు అధికారులు సూచించారు. చివరకు నిర్మాత, దర్శకులు ఒప్పుకోవడంతో ఈ సినిమా UA సర్టిఫికెట్ ఇచ్చారు.
రుద్రంగి సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. 142 నిమిషాల వ్యవధితో సినిమా కొనసాగుతుంది. ఇక సినిమా రివ్యూ తర్వాత ఇచ్చిన ఆదేశాలను, సూచనలను తప్పనిసరిగా తొలగించాలి. సెన్సార్ నిబంధనలు పాటించాలి. ఒకవేళ ఆదేశాలను పాటించలేదనే విషయం మా దృష్టికి వస్తే.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని సెన్సార్ అధికారులు తమ పత్రంలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











