బాలయ్య బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. మరీ ఇంత దారుణమా? అంటూ సీరియస్
హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం రూలర్. సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మేరకు ఆదివారం (డిసెంబర్ 22) రోజు హైదరబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సమావేశానికి బాలయ్య బాబు సహా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

బాలయ్య బాబు స్పీచ్.. స్ట్రాంగ్ వార్నింగ్
ఈ సమావేశంలో ఎప్పటిలాగే బాలయ్య బాబు తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు సినిమాలను పైరసీ చేస్తూ మార్కెట్ దెబ్బతీసే పైరసీ గాళ్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు రూలర్ సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని చెప్పాడు బాలకృష్ణ.

బాలకృష్ణ సీరియస్.. చాలా దారుణం
తమ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఖర్చుకు వెనకాడకుండా దర్శకనిర్మాతలు తీరిన సినిమాను పైరసీ చేయడం దారుణం అని పేర్కొంటూ బాలకృష్ణ సీరియస్ అయ్యాడు. రూలర్ సినిమాను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మాత 4K రెజల్యూషన్‌తో నిర్మించారని, ఇలా తీసిన సినిమాను, వాళ్ల కష్టాన్ని పైరసీ గాళ్లు.. బూడిదపాలు చేస్తున్నారని బాలయ్య బాబు అన్నాడు.

బాధ్యతగా స్వీకరించి సహకరించండి
పైరసీని కంట్రోల్ చేసేందుకు గాను మన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామని, అయినప్పటికీ ఈ పైరసీగాళ్ళ ఆగడాలు చూస్తూనే ఉన్నామని అన్నాడు. అందుకే అభిమానులు, ప్రేక్షకులు కూడా తమవంతు బాధ్యతగా స్వీకరించి పైరసీని ప్రోత్సహించకుండా కంట్రోల్ చేయాలని బాలయ్య ఆనాడు. ఏ సినిమానైనా థియేటర్స్‌లో చూసి ఆనందించడని అలా చూస్తేనే మంచి అనుభూతి పొందుతారని ఈ సందర్బంగా బాలకృష్ణ తెలిపాడు.

నా తరఫున, అభిమానుల తరఫున
రూలర్ ద్వారా ఓ మంచి ప్రయత్నం చేశాం. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు. కల్యాణ్‌గారు ఖర్చుకు ఎక్కడా కాంప్రైజ్ కాలేదు. కళ్యాణ్ గారితో నేను చేసిన మూడో సినిమా ఇది. మంచి కథా విలువలున్న సినిమా చేయాలని భావించే నిర్మాత ఆయన. ఆయనకు నా తరపున, అభిమానుల తరపున కృతజ్ఞతలు అని ఈ సందర్బంగా బాలయ్య బాబు అన్నాడు.


Click it and Unblock the Notifications











