బాలయ్య, రామ్ చరణ్ మధ్య టైటిల్ వివాదం
హైదరాబాద్ : నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య టైటిల్ వివాదం నెలకొనడం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాదంలో ఈ ఇద్దరు హీరోల ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా.....వారితో చిత్రాలు కమిటైన దర్శక నిర్మాతలు ఒకే టైటిల్ కోసం వివాదానికి దిగడమే ఇందుకు కారణం.
బాలయ్య త్వరలో బోయపాటి దర్శకత్వంలో 'రూలర్' టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటితో ఎన్టీఆర్ హీరోగా దమ్ము చిత్రం చేస్తున్న సమయంలోనే 'రూలర్' టైటిల్ తమ బేనర్ పై రిజిస్టర్ చేయించారు నిర్మాత కె.ఎస్.రామారావు.
అయితే 'దమ్ము' ప్లాపు తర్వాత బోయపాటికి, కె.ఎస్.రామారావు మధ్య గ్యాప్ పెరిగింది. ఈ నేపథ్యంలో 'రూలర్' టైటిల్ ఆయనకు ఇవ్వడానికి రామారావు సుముఖంగా లేడని ఫిల్మ్ నగర్ టాక్. 'రూలర్' టైటిల్‌తో రామ్ చరణ్ తేజతో సినిమా చేయాలని కెఎస్.రామారావు ప్లాన్ చేస్తున్నాడట. దర్శకుడి కోసం అన్వేషణ కూడా ప్రారంభించాడట.
ఏది ఏమైనా...ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండటంతో 'రూరల్' టైటిల్ బాలయ్య సినిమా అని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు జనాలు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా రూపొందబోయే సినిమాకు ఆ టైటిల్ పెడితే ఏం బాగుంటుంది? అని ప్రశ్నించే వారు లేకపోలేదు.
ఇక పోతే 'రూలర్' టైటిల్ వివాదంలో ఇరుక్కోవడంతో ఇతర టైటిళ్లను పరిశీలిస్తున్నాడట బోయపాటి శ్రీను. బాలయ్యతో ఆయన చేయబోయే సినిమా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రూపొందనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











