ఎంఎస్ రాజు ‘రమ్’ బ్యూటీలు.... ఫస్ట్‌లుక్ ఫోటో
హైదరాబాద్: రంభ, ఊర్వశి, మేనక.... మూడు పేర్లను కలగలిపి ముగ్గురు భామల అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించే కాన్సెప్టుతో రూపొందుతున్న సినిమా రమ్(RUM). ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రంభగా త్రిష, మేనక పాత్రలో ఇషా చావ్లా, ఊర్వశి పాత్రకు నికీషా పటేల్ చేస్తుండగా... మరో ప్రత్యేక పాత్రలో హీరోయిన్ చార్మి నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ దుబాయ్, మస్కట్లో జరుగుతోంది. షూటింగు స్పాట్లో ఈ నలుగురు భామలు కలిసి కెమెరా ముందు ఇలా ఫోజు ఇచ్చారు. సినిమాకు సంబంధించి ఈ ఫోటోనే ఫస్ట్ లుక్ ఫోటోగా పేర్కొంటున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది.
నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజు ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి.
ఇటీవల తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వంలో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు. మరి ఈ సినిమాలో ఎంఎస్ రాజు పని తీరు ఎలా ఉంటుందో చూడాలి.'


Click it and Unblock the Notifications











