‘రమ్’ మంచి కిక్కిస్తుంది : త్రిష
హైదరాబాద్ : 'రమ్' మంచి కిక్ ఇస్తుందని చెబుతోంది సౌతిండియా హాట్ హీరోయిన్ త్రిష. కొంప తీసి త్రిష చెబుతుంది ఆ....రమ్ గురించి అనుకోండి. ఆమె మాట్లాడేది 'రమ్' సినిమా గురించి. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం టైటిలోని అర్థం RUM (రంభ, ఊర్వశి, మేనక) అన్నమాట.
ఈచిత్రంలో రంభగా త్రిష మెయిన్ రోల్ చేస్తుండగా.....ఇతర హీరోయిన్లు పూర్ణ, అర్చన సైడ్ క్యారెక్టర్స్ ఊర్వశి, మేనక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ 'ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందని, ఫైట్ మాస్టర్ విజయ్ పర్యవేక్షణలో తాను డేర్ డెవిల్ యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నానని' వెల్లడించింది.
ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది. నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజ ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇటీవల తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వంలో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు. మరి ఈ సినిమాలో ఎంఎస్ రాజు పని తీరు ఎలా ఉంటుందో చూడాలి.
ఇతర విశేషాల్లోకి వెళితే..
త్రిష హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయింది. తెలుగులో త్రిష దాదాపు 20 చిత్రాల్లో నటించించింది. స్టాలిన్ చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవితో, కింగ్ చిత్రంలో నాగార్జునతో, నమోవెంకటేశ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలతో విక్టరీ వెకంటేష్, అతడు, సైనికుడు చిత్రాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు, తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో, జూ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో, వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు చిత్రాల్లో ప్రభాస్ సరసన, కృష్ణ చిత్రంలో రవితేజ సరసన ఇలా దాదాపు టాప్ హీరోలందరితో నటించింది. ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ మధ్య తెలుగులో నటించిన తీన్ మార్, దమ్ము చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా విశాల్ సరసన 'వేటాడు వెంటాడు' అనే తమిళ డబ్బింగ్ చిత్రం ద్వారా త్వరలో త్రిష తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Click it and Unblock the Notifications











